క‌ళాత‌ప‌స్వి బ‌యోపిక్‌

Last Updated on by

కళాత‌ప‌స్వి, లెజెండ్ కె.విశ్వ‌నాథ్ బ‌యోపిక్ ప్రారంభ‌మైంది. `విశ్వ‌నాధద‌ర్శ‌నం` అనేది ఈ సినిమా టైటిల్‌. `వెండితెర చెప్పిన బంగారు ద‌ర్శ‌కుని క‌థ‌` అనేది ఉప‌శీర్షిక‌. ర‌చ‌యిత‌ జ‌నార్థ‌న మ‌హ‌ర్షి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిన్న‌టిరోజున గురుపౌర్ణ‌మి వేళ సినిమాని ప్రారంభించారు. ప్ర‌ముఖ నిర్మాత వివేక్ కుచిభొట్ల‌తో క‌లిసి టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఏం చూపిస్తారు? అంటే తెలుగువాడైన కె.విశ్వ‌నాథ్ బాల్యంలో ఎలా ఉండేవారు? ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా ఎదిగేందుకు ఎలా త‌పించారు? ఆయ‌న అందుకున్న గౌర‌వం ఎలాంటిది.. వంటి ఎన్నో జీవిత విశేషాల్ని తెర‌పై చూపించ‌నున్నారు. ఒక సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన స్ఫూర్తివంత‌మైన జీవితాన్ని తెరపై ఆవిష్క‌రించ‌నున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌, వైయ‌స్సార్ బ‌యోపిక్‌, సానియా బ‌యోపిక్‌, సైనా బ‌యోపిక్, ఎంజీఆర్ బ‌యోపిక్ అంటూ బ‌యోపిక్‌ల వెల్లువ‌లో కె.విశ్వ‌నాథ్ వంటి లెజెండ్ బ‌యోపిక్ తీయ‌డం ప్ర‌శంసించ‌ద‌గిన‌ది.

User Comments