`కాలా` ఎందుకింత‌ స‌స్పెన్స్‌!

Last Updated on by

`కొచ్ఛాడ‌యాన్‌`, `క‌బాలీ` .. ఈ రెండు సినిమాలు తెలుగులో డిజాస్ట‌ర్స్‌. ఆ ఫ‌లితం టాలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను డిఫెన్స్‌లో ప‌డేసింది. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అయినా.. ఎవ‌రూ కొనేందుకు ముందుకు రాక‌పోవ‌డం వెన‌క ఆ రెండు సినిమాల ఫ‌లితాలు ఎంత భ‌య‌భ్రాంతుల్ని చేశాయో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే కార‌ణం `కాలా` బిజినెస్‌కి పెద్ద అడ్డంకిగా మారింది.

అయితే ఇంత జ‌రుగుతున్నా.. డిస్ట్రిబ్యూట‌ర్లు కొనేందుకు వెన‌కాడుతున్నా.. ఎందుక‌నో ఇంకా ఇంకా నిర్మాత ధ‌నుష్ ఈ సినిమాపై భారీ ఆశ‌ల‌తోనే ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. సినిమా రిలీజ్‌కి ఇంకా ఎంతో స‌మ‌యం లేనేలేదు. జూన్ 7 రిలీజ్ అంటూ ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా తెలుగు రిలీజ్ హ‌క్కుల బేర‌సారాలు సాగుతున్నాయి. అయితే ఎంత‌కీ బేరం తెగ‌క‌పోవ‌డంపై ఫిలింన‌గ‌ర్‌లో స‌ర్వ‌త్రా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `కాలా`ను కొనేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇక ఈ సినిమా నిర్మించిన ధ‌నుష్ అస‌లే త‌గ్గ‌డం లేదుట‌. దాదాపు 40 కోట్ల మేర తెలుగు హ‌క్కుల‌కు కోట్ చేస్తున్నారు. అంటే ఇది రోబో తెలుగు రాష్ట్రాల‌ క‌లెక్ష‌న్లు (30కోట్లు) కంటే చాలా ఎక్కువ‌. అయితే డిజాస్ట‌ర్ల స‌న్నివేశంలో ర‌జ‌నీ సినిమాని 20 కోట్ల‌కు కొనేందుకైనా అంతా భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఇంకా తెలుగు రైట్స్ అమ్ముడుపోలేదు. ఒక‌వేళ ఇదే స‌న్నివేశం ఉంటే ధ‌నుష్ స్వ‌యంగా రిలీజ్ చేసేందుకు తెగిస్తార‌న్న మాటా వినిపిస్తోంది. కాలా విష‌యంలో అస‌లేం జ‌ర‌గ‌బోతోందో వేచి చూడాలి.

User Comments