చిరంజీవి అల్లుడికి కూడా అది త‌ప్ప‌దా..?

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఎవ‌రేం అనుకున్నా సెంటిమెంట్స్ కు ఉండే విలువ వేరు. కొన్నిసార్లు నెగిటివ్ సెంటిమెంట్స్ కు బాగానే భ‌య‌ప‌డుతుంటారు హీరోలు. అవి కేవ‌లం సెంటిమెంట్స్ అని తెలిసినా కూడా ఎందుకో కానీ టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఇప్పుడు మెగా చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విష‌యంలోనూ ఇదే టెన్ష‌న్ పడుతున్నారు మెగా కుటుంబం. ఇన్నాళ్లూ మెగా హీరోల విష‌యంలో ప‌ని చేసిన ఓ సెంటిమెంట్ ఇప్పుడు చిన్న‌ల్లుడిని కూడా టెన్ష‌న్ పెడుతుంది. అదే రెండో సినిమా. ఈ ఫ్యామిలీలో ఇప్ప‌టి వ‌ర‌కు తొలి సినిమా ఎవ‌రికి పెద్ద హిట్ కాలేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచే ఇది కొన‌సాగుతుంది. ఆయ‌న తొలి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి యావ‌రేజ్.. అల్లుఅర్జున్ గంగోత్రి బాగానే ఆడినా పేరు రాలేదు.. రామ్ చ‌ర‌ణ్ చిరుత కూడా యావ‌రేజ్.. అల్లు శిరీష్ గౌర‌వం ఫ్లాప్.. వ‌రుణ్ తేజ్ ముకుందా పేరొచ్చింది కానీ హిట్ కాదు.. సాయిధ‌రంతేజ్ పిల్లా నువ్వులేని జీవితం యావ‌రేజ్.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రు తొలి సినిమాతో యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయారు. కానీ వీళ్లంద‌రి రెండో సినిమాలు మాత్రం బాగానే ఆడాయి. ప‌వ‌న్ గోకులంలో సీత‌.. బ‌న్నీకి ఆర్య‌.. చ‌ర‌ణ్ కు మ‌గ‌ధీర‌.. వ‌రుణ్ తేజ్ కు కంచె.. అల్లు శిరీష్ కు శ్రీ‌రస్తు శుభ‌మ‌స్తు.. ఇలా అంతా రెండో సినిమాతో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చిన్న‌ల్లుడు విజేత‌తో వ‌స్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే టెన్ష‌న్ అంద‌ర్లోనూ ఉంది. రాకేష్ శ‌శి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై ఆస‌క్తి బాగానే క‌నిపిస్తుంది.

User Comments