అబ్బాయి.. బాబాయి కోసం వచ్చాడు

Last Updated on by

విచిత్రం జ‌రిగింది.. పైన ఉన్న ఎన్టీఆరే మ‌ళ్లీ త‌న కుటుంబాన్ని క‌లిపేసాడు. క‌లిపాడో లేదంటే క‌లిసిన‌ట్లుగా న‌టిస్తున్నాడో తెలియ‌దు కానీ ఇన్నాళ్లూ దూరంగా ఉన్న కుటుంబం మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ లో క‌లిసింది. కొన్నేళ్లుగా నంద‌మూరి కుటుంబంలో వివాదాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. దానికి ఎవ‌రూ కాద‌న‌లేరు. ఎందుకంటే హ‌రికృష్ణ కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టారు బాల‌య్య‌. ఆ కుటుంబంతో క‌నీసం సంబంధాలు కూడా లేవు. ఎంత‌లా అంటే బాల‌య్య చిన్న కూతురు పెళ్ళికి ఎన్టీఆర్ కు ఆహ్వానం కూడా ఇవ్వ‌నంత‌గా. ఈ మ‌ధ్య ఎప్పుడూ ఎక్క‌డా అబ్బాయిల గురించి బాబాయ్ చెప్పింది లేదు. కానీ ఇప్ప‌టికీ క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం బాల‌య్య‌ను మా బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే ఇన్నాళ్లూ ఒక సైడ్ ఉన్న ప్రేమ‌.. ఇప్పుడు రెండో వైపుకు మారింది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ లో నంద‌మూరి కుటుంబం అంతా క‌నిపిస్తుంది.. క‌ళ్యాణ్ రామ్ తో పాటు. ఎన్టీఆర్ రావ‌ట్లేదు. ఇక్క‌డా ఒక్క‌టే కార‌ణం లుక్ బ‌య‌టికి రాకూడ‌ద‌ని. దాంతో ఆహ్వానం ఉన్నా కూడా బ‌య‌టికి రావ‌డం లేదు జూనియ‌ర్. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో జ‌రుగుతుంది. రామ‌కృష్ణ స్టూడియోస్ లో ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర ద‌ర్శ‌కులు.. టాప్ టెక్నీషియ‌న్స్ అంతా ఈ ఓపెనింగ్ కు వ‌చ్చారు. మొత్తానికి పెద్దాయ‌న పుణ్య‌మా అని కుటుంబం ఒక్క‌టైతే చాలంటున్నారు అభిమానులు కూడా.

User Comments