క‌ళ్యాణ్ రామ్ కు బాగానే క‌లిసొస్తున్నాయ్..

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌, ఎన్టీఆర్ మాత్ర‌మే స్టార్లుగా మారారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు కానీ త‌మ్ముడి రేంజ్ లో సూప‌ర్ స్టార్ కాలేక‌పోయాడు. అయితే ఇప్పుడిప్పుడే క‌ళ్యాణ్ రామ్ టైమ్ మారుతున్న‌ట్లు అనిపిస్తుంది. ఈ మ‌ధ్యే త‌మ్ముడితో ఈయ‌న నిర్మించిన జై ల‌వ‌కుశ బాగానే వ‌సూలు చేసింది. నిర్మాత‌గా ఈయ‌న‌కు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు హీరోగా కూడా క‌ళ్యాణ్ రామ్ టైమ్ ట‌ర్న్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక‌టి ఎమ్మెల్యే.. రెండు జ‌యేంద్ర‌తో సినిమా. ఇందులో ఎమ్మెల్యే షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. కాజ‌ల్ తో ఇందులో రొమాన్స్ చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ ద‌ర్శ‌కుడు. ఇక జ‌యేంద్ర సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆర్ఎఫ్సీలో జ‌రుగుతుంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్న‌పుడే శాటిలైట్ అయిపోయింది.

ఇదే ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కు త‌గిలిన జాక్ పాట్. ఎమ్మెల్యే 4.50 కోట్ల‌కు శాటిలైట్ అయితే.. జ‌యేంద్ర సినిమా కూడా ఇంచుమించు అదే రేట్ కు వెళ్లిపోయింది. ఈ రెండు సినిమాల‌ను జెమినీ కొనేసింద‌ని తెలుస్తోంది. ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండ‌టం.. ఆ రెండు సినిమాలు ఎలా ఉంటాయో కూడా ఆరా తీయ‌కుండానే శాటిలైట్ అయిపోవ‌డం అంటే క‌ళ్యాణ్ రామ్ కూడా స్టార్ అయిపోయిన‌ట్లే. ఈ రెండు సినిమాల‌తో పాటు ఇప్పుడు మ‌రో మూడు సినిమాల‌కు క‌మిట‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. మ‌ళ‌యాలంలో సూప‌ర్ హిట్టైన రామ్ లీలా రీమేక్.. కోన‌వెంక‌ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఒక‌టి.. ఉయ్యాలా జంపాలా ఫేమ్ రామ్మోహ‌న్ నిర్మాణంలో మ‌రో సినిమా చేయ‌డానికి క‌ళ్యాణ్ రామ్ సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఆ మ‌ధ్య అన్నీ సొంత ప్రొడ‌క్ష‌న్ లోనే న‌టించిన క‌ళ్యాణ్ రామ్.. ఇప్పుడు బ‌య‌టి హీరోగా మారిపోయాడు. అంటే ఈయ‌న రేంజ్ పెరిగిపోయిన‌ట్లే..!