ఎమ్మెల్యేకే కిర్రాక్ పార్టీ ఇచ్చిన హీరో

నిఖిల్ ఏంటి ఎమ్మెల్యేను ప‌డేయడం ఏంటి..? ఆయ‌న ఎందుకు రాజ‌కీయ నాయ‌కుడి జోలికి వెళ్లాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు అవ‌స‌రం వ‌చ్చింది కాబ‌ట్టి వెళ్ల‌క త‌ప్ప‌లేదు మ‌రి. నిఖిల్ ప్ర‌స్తుతం కిర్రాక్ పార్టీ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రి 9నే వ‌స్తుంది అనుకున్న సినిమా కాస్తా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆల‌స్యం కావ‌డంతో మార్చ్ కి వెళ్లిపోయింది. మార్చ్ 16న ఈ సినిమా విడుద‌ల కానుంది. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు చందూ మొండేటి డైలాగులు రాస్తే.. సుధీర్ వ‌ర్మ స్క్రీన్ ప్లే రాసాడు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇక ఇదే టైమ్ లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన ఎమ్మెల్యే కూడా విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా న‌టిస్తున్నాడు. కాజ‌ల్ హీరోయిన్. ల‌క్ష్మీక‌ళ్యాణం త‌ర్వాత వీళ్లిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను ముందు కిర్రాక్ పార్టీకి పోటీగా విడుద‌ల చేయాల‌నుకున్నా.. ఇప్పుడు అది మారిపోయింది. మార్చ్ 23న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇక మార్చ్ 29న మ‌హాన‌టి వ‌స్తుంద‌నుకున్నా.. అది ఇప్ప‌ట్లో వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. ఆ మ‌రుస‌టి రోజు రంగ‌స్థ‌లం ఎలాగూ వ‌స్తుంది. మొత్తానికి మార్చ్ అంతా అలా సెట్ట‌యిపోయింద‌న్న‌మాట‌.

User Comments