బ‌రిలోకి తుగ్ల‌క్

KalyanRam to speak on 118 success

118 తర్వాత‌ కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్ క‌న్ఫామ్ అయ్యింది. యువ‌ దర్శకుడు వేణు మల్లిడి చెప్పిన ఓ వైవిధ్యమైన కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. సోషియో ఫాంటసి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈచిత్రానికి తుగ్లక్ అనే టైటిల్ ప్రచారం లో వుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్నా ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ నిర్మించనున్న ఈచిత్రానికి నాయిక‌ల్ని ఎంపిక చేయాల్సి ఉందిం. 118 విజ‌యంతో క‌ళ్యాణ్ ఫామ్ లోకి వ‌చ్చాడు.

క‌ళ్యాణ్ రామ్కు `ప‌టాస్` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డ్డా! 118 రిలీఫ్ నిచ్చింది. ఆ ఉత్సాహంతోనే వైవిథ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. తెలుగు ద‌ర్శ‌కులు క‌న్నా త‌మిళ్ ద‌ర్శ‌కులే ఉత్త‌మం అని అటు వైపు చూస్తున్నాడు. తుగ్ల‌క్ త‌ర్వాత సెట్స్ కు వెళ్ల‌కుండానే కొత్త క‌థ‌లు వింటున్నాడుట‌. మంచి క‌థ‌లు కుదిరితే లాక్ చేస్తున్నాడుట‌. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గ‌త కొన్నేళ్ల‌గా ఇదే పంథాలో వెళ్తున్నాడు. న‌చ్చిన క‌థ‌ల‌ను వెల‌క‌ట్టి అటుపై సీనియ‌ర్ రైట‌ర్ల‌తో మార్పులు చేర్పులు చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా వేలో క‌ళ్యాణ్ రామ్ వెళ్తున్నాడు.