క్రిష్ గుండెల్లో మంట పెట్టాడా

`మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` ఈ శుక్ర‌వారం రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఈ సినిమా ఒక సెక్ష‌న్ ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధం చేస్తోందంటూ ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ప‌లువురు సెల‌బ్రిటీల నుంచి పాజిటివ్ రివ్యూలు రావ‌డం ఆస‌క్తి పెంచింది. వాస్త‌వానికి మ‌ణిక‌ర్ణిక ఎన్నో ఒడిదుడుకుల మ‌ధ్య రిలీజైంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్ మ‌ధ్య‌లోనే వ‌దిలి వ‌చ్చేయ‌డం, ఆ త‌ర్వాత దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని కంగ‌న పూర్తి చేయ‌డం నేప‌థ్యంలో ఎంతో ఎమోష‌న్ క‌నిపించింది.

కంగ‌న వ్య‌వ‌హారికంపై .. క్రిష్ ఇప్ప‌టికే సీరియ‌స్ గానే ఉన్నాడు. భోజ్ పురి సినిమాలా తీశావ్! అంటూ కంగ‌న త‌న‌ని కామెంట్ చేసింద‌ని అన్నాడు క్రిష్‌. అయితే కంగ‌న‌కు బాస‌ట‌గా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ నిలిచారు. ఇప్పుడు మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి సోద‌రుడు క‌ళ్యాణి మాలిక్ సైతం కంగ‌న‌ను పొగిడేస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్ పెట్ట‌డం ఆస‌క్తి పెంచుతోంది. మ‌ణిక‌ర్ణిక చిత్రంపై క‌ల్యాణి మాలిక్ త‌న‌దైన శైలిలో పొగిడేశారు. కంగ‌న ప్ర‌తిభ‌ను కొనియాడారు. “మ‌ణిక‌ర్ణిక‌` సూప‌ర్భ్. కంగ‌న‌ గురించే మాట్లాడుకోవాలి. ఇది కంగ‌న మూవీ. భార‌తీయ‌ సినిమాకు ఇలాంటి ప్ర‌య‌త్నం గ‌ర్వ‌కార‌ణం. ద్వితీయార్థంను కంగ‌న‌ బ్రిలియంట్‌గా తీశారు. ఎవ‌రు డైరెక్ట్ చేశార‌నేది అన‌వ‌స‌రం. గొప్ప ఎమోష‌న‌ల్ గా తీర్చిదిద్దారు.. మిస్ కావొద్దు“ అంటూ ట్విట్ట‌ర్ లో వ్యాఖ్యానించారు క‌ళ్యాణి మాలిక్. ఓవైపు క్రిష్ క్వీన్ కంగ‌న‌పై గ‌రంగ‌రంగా ఉంటే ఈయ‌న ఇలాంటి వ్యాఖ్య‌ను పెట్టడం దేనికి సంకేతం? అంటూ ముచ్చ‌టా సాగుతోంది. క‌ళ్యాణి మాలిక్ ప్ర‌స్తుతం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.