తుగ్ల‌క్ క‌థేమిటి క‌ళ్యాణ్ రామ్‌?

Last Updated on by

ప‌టాస్, 118 చిత్రాల‌తో స‌క్సెస్ అందుకున్నాడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్. `అత‌నొక్క‌డే` త‌ర్వాత కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలతో విసుగెత్తిన క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్ టైమ్ నుంచి స్క్రిప్టు ప‌రంగా ఎంతో జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఆ క్ర‌మంలోనే 118 లాంటి ప్ర‌యోగం చేసి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్నాడు.ఈ సినిమా లాభ‌న‌ష్టాల మాట అటుంచితే అత‌డి న‌ట‌న‌కు పేరొచ్చింది. న‌టుడిగా ప‌రిణతికి చ‌క్క‌ని మార్కులేశారు క్రిటిక్స్.

ఈ ఉత్సాహంలోనే.. ప్ర‌స్తుతం మ‌రో ప్ర‌యోగానికి క‌ళ్యాణ్ రామ్ స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు. ఈసారి ఏకంగా `తుగ్ల‌క్` అంటూ స‌ర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు. ఇదో సోషియో ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ స్టోరి. వేణు మ‌ల్లిడి ద‌ర్శక‌త్వం వ‌హించ‌నున్నాడు. అస‌లు క‌థాంశ‌మేంటి? అంటే ఇది పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థ ఉంటుంద‌ని తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఉయ్యాల జంపాల ఫేం విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోనూ క‌ళ్యాణ్ రామ్ వేరొక సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముంబైలో చిత్రీక‌రించ‌నున్నారు. ఏప్రిల్ 1 నుంచి సెట్స్ పైకి వెళుతున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Can This Comedian Live Up To Brahmanandam?

User Comments