మ‌రికొద్ది గంట‌ల్లో క‌మ‌ల్ విశ్వరూపం

Last Updated on by

త‌మిళ‌నాట మ‌రో రాజ‌కీయ పార్టీ ఆవిర్భావానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం న‌టుడిగానే అల‌రించిన క‌మ‌ల్ హాస‌న్.. ఇక‌పై రాజ‌కీయ నాయ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. ఈయ‌న పాలిటిక్స్ లోకి వ‌స్తున్న‌ట్లు చాలా కాలం కిందే అనౌన్స్ చేసాడు కానీ పార్టీని మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించలేదు. టైమ్ చూసుకుని అన్నీ చెప్తానంటూ చాలా కాలంగా చెప్తూ వ‌స్తున్నారు క‌మ‌ల్. ఇప్పుడు ఆ టైమ్ వ‌చ్చింది. అందుకే అన్నీ చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు క‌మ‌ల్. ఈయ‌న కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న చెన్నైలోని ఒత‌క‌డై గ్రౌండ్స్ లో ఫిబ్ర‌వ‌రి 21 సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది.

వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో త‌న పార్టీ ప్ర‌క‌ట‌న‌తో పాటు త‌నెందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానో కూడా క్లారిటీ ఇవ్వ‌నున్నాడు లోక‌నాయ‌కుడు. అలాగే పార్టీ ఎలా ప‌ని చేస్తుందో.. నిర్దేశ‌క‌త్వాలు ఏంటో చెప్ప‌బోతున్నాడు. ఇక‌పై పూర్తిగా తాను ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని చెబుతున్నాడు క‌మ‌ల్. ఈ పార్టీ ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మానికి ర‌జినీకాంత్ తో పాటు విజ‌య్ కాంత్, స్టాలిన్ లాంటి వాళ్లు కూడా రానున్నారు. అంద‌ర్నీ స్వ‌యంగా క‌మ‌లే ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. మొత్తానికి త‌మిళ‌నాడులో కొత్త యుగానికి శ్రీ‌కారం చుడదాం అనే నినాదంతో వ‌స్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్. మ‌రి ఈయ‌న మార్పు ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

User Comments