కమల్ కు చీకటి రాజ్యం నుంచి విముక్తి

Last Updated on by

క‌మ‌ల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్ళైంది. ఇన్నేళ్ల‌లో ఎన్నో సినిమాలు చేసాడు ఈ హీరో. కానీ ఒక్క సినిమా మాత్రం ఆయ‌న‌కు చుక్క‌లు చూపించింది. 50 ఏళ్ల కెరీర్ లో ఏ సినిమాకు ప‌డ‌న‌న్ని ఇబ్బందులు ఒక్క సినిమాతో ప‌డ్డాడు క‌మ‌ల్. అదే విశ్వ‌రూపం. నాలుగేళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం క‌మ‌ల్ హాస‌న్ ను కావాల్సిన‌న్ని ఇబ్బందులు పెట్టింది. అప్ప‌ట్లో ఈ చుక్క‌లకు అమ్మ స‌పోర్ట్ కూడా ఉంది. విశ్వ‌రూపంతో పాటే దానికి సీక్వెల్ కూడా చేసాడు క‌మ‌ల్. కాక‌పోతే ఈ ర‌చ్చ‌లో ప‌డి తాను కూడా ఈ సినిమా విష‌యం మ‌రిచిపోయాడు.ఈ సినిమాకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా క‌మ‌ల్ హాస‌నే. ఈ సినిమాతో ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాడు క‌మ‌ల్. ఇంత చుక్క‌లు చూపించినా విశ్వ‌రూపం అంటే క‌మ‌ల్ కు చాలా ఇష్టం. అందుకే విశ్వ‌రూపం 2 కూడా సిద్ధం చేసాడు ఈ హీరో. ఈ చిత్ర ట్రైల‌ర్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌లైంది.Kamal Haasan Vishwaroopam 2 Trailer Coming Soonఈ సినిమా షూటింగ్ మొద‌లై నాలుగేళ్ల‌వుతుంది. అప్పుడెప్పుడో 2013లో మొద‌లైంది విశ్వ‌రూపం. మొద‌టి భాగం వ‌చ్చిన ఆర్నెళ్ల‌కే రెండోది తీసుకుని రావాలి అని భావించాడు క‌మ‌ల్. కానీ అప్పుడు ఆగిన షూటింగ్ ఈ మ‌ధ్యే పూర్త‌యింది. ఈ సినిమా త‌ర్వాత పాప‌నాశం, చీక‌టిరాజ్యం, ఉత్త‌మ‌విల‌న్ సినిమాలు చేసాడు క‌మ‌ల్. కానీ విశ్వ‌రూపం 2కి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మోక్షం రాలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో కూడా క్లారిటీ లేదు. విశ్వ‌రూపం హిట్ అనిపించుకున్నా.. క‌మ‌ల్ కు మిగిలిందేమీ లేదు. ఈ సినిమాతో న‌ష్టాలే వ‌చ్చాయి ఈ హీరోకి. దాంతో విశ్వ‌రూపం 2ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ నిర్మించాడు. కానీ మ‌ధ్య‌లోనే ఈ నిర్మాత కూడా చేతులెత్తేసాడు.Kamal Haasan Vishwaroopam 2 Trailer Coming Soonఆ త‌ర్వాత అగ‌మ్య‌గోచ‌రంగా మారిన విశ్వ‌రూపం 2ను మ‌ళ్లీ క‌మ‌ల్ ముందుకొచ్చి నెత్తినేసుకున్నాడు. ఆ మ‌ధ్య ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు క‌మ‌ల్ హాస‌న్. ఇండియ‌న్ జెండాతో ఉన్న విశ్వ‌రూపం 2 ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే ఈ సారి ఖచ్చితంగా సెంటిమెంట్ తో కొట్ట‌బోతున్నాడు క‌మ‌ల్. గ‌తంలో ముర‌ద‌నాయ‌గం, మ‌ర్మ‌యోగి లాంటి సినిమాల్ని మొద‌లుపెట్టి ఆపేసిన క‌మ‌ల్.. విశ్వ‌రూపం 2కి ఆ గ‌తి రాకూడ‌ద‌ని ఫిక్స‌య్యాడు. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా బాక్సుల్లోంచి ఆ సినిమాను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్. మ‌రి ట్రైల‌ర్ తోనైనా సినిమాపై ఆస‌క్తి పెరుగుతుందా.. విడుద‌ల‌కు మోక్షం దొరుకుతుందా..? అన్న‌ట్లు ఈ మ‌ధ్యే మ‌రో వివాదం కూడా విశ్వ‌రూపం 2ను చుట్టుముట్టింది.

User Comments