తీవ్ర‌వాదంపై క‌మ‌ల్ యుద్ధం

Last Updated on by

అస‌లింత‌కీ `విశ్వ‌రూపం 2`లో క‌మ‌ల్ హాస‌న్ పాత్ర ఏంటి? మోస్ట్ వాంటెడ్‌ అల్‌ఖైదాకి క‌మ‌ల్‌హాస‌న్‌కి ఉన్న లింకేంటి? అస‌లు ఇండియ‌న్‌ ఆర్మీనే అత‌డిని `మోస్ట్ వాంటెడ్‌` అని ఎందుకు ప్ర‌క‌టించింది. మ‌న దేశానికి సంబంధం లేకుండా ఎక్క‌డో విదేశాల్లో అత‌డు త‌ల‌దాచుకోవ‌డం ఏంటి? అస‌లింత‌కీ ఎందుకు క్లాసిక‌ల్ మాస్ట‌ర్‌గా మారాడు? ఇలా ఎన్నో ఎన్నో ప్ర‌శ్న‌లు సామాన్యుడి గుండెల్లో. ఈ ప్ర‌శ్న‌లన్నిటికీ `విశ్వ‌రూపం 2` స‌మాధాన‌మివ్వ‌బోతోంది. గూస్ బంప్స్‌.. రోమాలు నిక్క‌బొడ‌వ‌డం అనే మాట‌లు విన‌డం కాదు ప్ర‌త్య‌క్షంగా అనుభవించే టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది.

క‌మ‌ల్ ది గ్రేట్.. క‌మ‌ల్ స‌ర్ మీకు హ్యాట్సాఫ్‌..! అని దేశ ప్ర‌జ‌లంతా సెల్యూట్ కొట్టే రోజు రాబోతోంది. జ‌స్ట్ వెయిట్ .. ఇంకో ప‌ది రోజులే. అన్ని స‌స్పెన్స్‌ల‌కు తెర దించే రోజు అది. ఆగ‌స్టు 10 ముహూర్తం. ఆరోజుకు ఇంకో 9రోజులే. `విశ్వ‌రూపం 2`ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌క‌జ‌నం వీక్షించే త‌రుణం ఆస‌న్న‌మైంది. అస‌లు ప్ర‌పంచాన్ని అంతం చేయాల‌న్న తీవ్రవాదం ఎక్క‌డినుంచి పుట్టుకొచ్చింది? అల్‌ఖైదా ఎజెండా వెన‌క అస‌లు కార‌ణం? ప‌్ర‌పంచ వినాశ‌నానికి ప్ర‌భుత్వాలే బాట‌లు వేశాయా? అస‌లు ఇందులో ముస్లిమ్ చాంద‌సుల‌కు సంబంధం ఏంటి? విశ్వ‌రూపం సినిమా ముస్లిముల్ని వ్య‌తిరేకించేదా? అస‌లు క‌మ‌ల్‌హాస‌న్ ఉద్ధేశం ఏంటి? విశ్వ‌రూపం మీనింగ్ ఏంటి? వేన‌వేల ప్రశ్న‌ల‌కు ఒక‌టే స‌మాధానం. థియేట‌ర్ల‌లో `విశ్వ‌రూపం 2` వీక్షించ‌డం. ఇప్ప‌టికే రెండు ట్రైల‌ర్లు రిలీజై హీట్ పెంచాయి. తాజా ట్రైల‌ర్‌లో అస‌లు తాను ముస్లిముల‌కు ఏమాత్రం వ్య‌తిరేకిని కాన‌ని క‌మ‌ల్ చెప్ప‌క‌నే చెప్పాడు. అస‌లు ప్ర‌భుత్వాలే దిగి వ‌చ్చి తీవ్ర‌వాదుల‌తో చ‌ర్చిస్తే అస‌లు తీవ్ర‌వాద‌మే మిగిలేది కాద‌ని, ఈ విధ్వంశ కాండ ఉండేది కాద‌ని ఒక గొప్ప‌ నిత్య‌స‌త్యాన్ని అత‌డు `విశ్వ‌రూపం 2`లో ఆవిష్క‌రిస్తున్నాడ‌ని తాజా ట్రైల‌ర్ చెప్పింది. ఇంకో 9రోజులే జ‌స్ట్ వెయిట్‌..

User Comments