విశ్వ‌నటుడి అప్పులు తీరేనా?

Last Updated on by

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం 2 రెండేళ్లుగా రిలీజ్‌కి నోచుకోక‌ అంప‌శ‌య్య‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యినా.. మ‌ధ్య‌లో ర‌క‌ర‌కాల ఆర్థిక‌ప‌ర‌మైన గొడ‌వ‌లు.. రాజ‌కీయ సంబంధ లుక‌లుక‌లు ఈ సినిమా రిలీజ్‌కి అడ్డంకిగా మారాయి. కొన్ని మ‌త సంస్థ‌లు కేసులు భ‌నాయించి క‌మ‌ల్‌ని నిశ్చేష్టుడిని చేశాయి. ఓ వైపు భారీగా బ‌డ్జెట్ కేటాయించి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన సినిమా రిలీజ్ విష‌య‌మై క్లారిటీ మిస్స‌వ‌డంతో క‌మ‌ల్ ఎంతో ఆవేద‌న చెందారు.

ఈ సినిమా పేరుతో దాదాపు 60కోట్ల మేర తాను న‌ష్ట‌పోయాన‌ని క‌మ‌ల్ ఓ సంద‌ర్భంలో ఆవేద‌న చెందారు. విశ్వ‌రూపం 2కి రాజ‌కీయ అడ్డంకులు.. మ‌త‌మూఢ‌త్వ అడ్డంకులు ఏర్ప‌డ్డాయ‌ని అప్ప‌ట్లో త‌మిళ మీడియా ఘోషించింది. భారీగా ఫైనాన్స్‌లు తెచ్చిన క‌మ‌ల్ బృందం.. పంపిణీదారుల‌తో గొడ‌వ‌లు ప‌డ్డార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. రిలీజ్ చేయాల్సిన వాడే మోకాల‌డ్డాడ‌ని చీక‌టిరాజ్యం ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్ ఆవేద‌న చెంద‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది.

ఇక త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి కీ.శే జ‌య‌ల‌లిత `విశ్వ‌రూపం 2`ని రిలీజ్ కానీకుండా మోకాల‌డ్డిన సంగ‌తి తెలిసిందే. అదంతా అటుంచితే.. జూన్ 11న `విశ్వ‌రూపం2` ట్రైల‌ర్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ని తార‌క్‌, హిందీ వెర్ష‌న్ ట్రైల‌ర్‌ని అమీర్‌ఖాన్‌, త‌మిళ వెర్ష‌న్ ట్రైల‌ర్‌ని శ్రుతిహాస‌న్ లాంచ్ చేయ‌నున్నార‌ని ప్ర‌క‌టించారు. ఈ సినిమా ఇక‌నైనా స‌వ్యంగా రిలీజై.. స‌క్సెస్ సాధిస్తుంద‌నే అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `విశ్వ‌రూపం 2` స‌క్సెస్‌తో క‌మ‌ల్ హాస‌న్‌ పాత అప్పులు తీరిపోతాయా? ఫైనాన్స్ గొడ‌వ‌లు స‌ద్ధుమ‌ణుగుతాయా? అన్న‌ది చూడాలి.

User Comments