Kamal Hassan Retirement Announced for Political career

క‌మ‌ల్ ఇక సినిమాలు చేయడా?

Kamal Hassan Retirement Announced for Political career

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో రిటైర్మెంట్ ల టైమ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే ర‌జినీకాంత్ సినిమాలు ఇక చాలు అనుకుంటున్నాడు. ఈయ‌న కాలా, 2.0 త‌ర్వాత తెర‌పై క‌నిపించ‌డం క‌ష్ట‌మే. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నేను సినిమాలు చేయ‌నంటున్నాడు. ఈ కోవ‌లోకే ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా వ‌చ్చి చేరాడు. ఈయ‌న కూడా నాకు ఇక సినిమాలు చాలు అంటున్నాడు. కాక‌పోతే మ‌రో రెండేళ్లు.. రెండు సినిమాల త‌ర్వాత గుడ్ బై చెప్తానంటున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం ఈయ‌న శ‌భాష్ నాయుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొద‌లుపెట్టి చాలా కాల‌మైంది. ఇది ఆయ‌న సొంత సినిమా కాబ‌ట్టి స‌మ‌స్య లేదు. కానీ ఇప్పుడు ఆయ‌న భార‌తీయుడు 2 సినిమాకు క‌మిట‌య్యాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ముందు దిల్ రాజు నిర్మాత అనుకున్నా కూడా ఆయ‌న ప్రాజెక్ట్ లోంచి త‌ప్పుకున్నాడు. శంక‌ర్ ఈ చిత్రాన్ని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా తెర‌కెక్కించ‌బోతున్నాడు. 2.0 త‌ర్వాత భార‌తీయుడు 2 తెర‌కెక్క‌బోతుంది.

శంక‌ర్ సినిమా అంటే ఖచ్చితంగా రెండేళ్లు ప‌డుతుంది కాబ‌ట్టే రెండేళ్ల త‌ర్వాత సినిమాల‌కు రిటైర్మెంట్ ఇస్తాన‌ని చెప్పాడు క‌మ‌ల్ హాస‌న్. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న క‌మ‌ల్ సినిమాల నుంచి మెల్ల‌గా సైడ్ అయిపోవాల‌ని ఫిక్సైపోయాడు. ఈయ‌న కెరీర్ మొద‌లై 58 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో 1960లో బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు క‌మ‌ల్. 37 ఏళ్లుగా హీరోగా కొన‌సాగుతున్నాడు. ఈ మ‌ధ్య‌లో ప్ర‌పంచంలో ఏ న‌టుడికి సాధ్యం కాని రీతిలో ఎన్నో సినిమాల‌కు.. ఎన్నో సంస్థ‌ల నుంచి 182 అవార్డులు అందుకుననాడు లోక‌నాయ‌కుడు. ఇక జాతీయ అవార్డులు, నంది అవార్డులు, రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డులకు కూడా కొద‌వే లేదు. మొత్తానికి ఈ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ఎందుకని సింపుల్ గా ఓ ప‌డ‌వ నుంచి తానే కాలు తీసేయ‌డానికి ఫిక్సైపోయాడు క‌మ‌ల్ హాస‌న్. మ‌రి సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లో ఏం మార్పు తీసుకొస్తాడో చూడాలి..?

క‌మ‌ల్ ఇక సినిమాలు చేయడా?
0 votes, 0.00 avg. rating (0% score)