తీవ్ర‌వాదంపై యుద్ధం చూడండి!

Last Updated on by

విశ్వ‌న‌టుడు క‌మల్‌హాస‌న్ డ్రీమ్ ప్రాజెక్ట్ `విశ్వ‌రూపం 2` ఆగ‌స్టు 10న‌ తెలుగు, త‌మిళ్‌, హిందీలో అత్య ంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. క‌మ‌ల్ హాస‌న్ స్వీయ‌నిర్మాణ ద‌ర్శ‌క‌త్వ ంలో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ని హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు. విశ్వ‌రూపం 2 రిలీజ్ సంద‌ర్భ ంగా ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని ముచ్చ‌టించారు.

క‌మ‌ల్‌హాస‌న్ మాట్లాడుతూ -“విశ్వ‌రూపం 2 చిత్రంలో పార్ట్ 1కి కొన‌సాగింపు చూపిస్తున్నాం. ఇందులో పాత్ర‌ల ర‌హ‌స్యాల్ని రివీల్ చేస్తున్నాం. రా ఏజెంట్ వ‌శీం అహ్మ‌ద్‌ క‌శ్మీరీ అస‌లు స్వ‌రూపం ఏంటో తెర‌పై చూపిస్తున్నాను. అస‌లు నా పాత్ర విదేశాల్లో డ్యాన్స్ మాస్ట‌ర్‌గా స్లీపింగ్ మోడ్‌లో ఎందుకు ఉందో రివీల్ చేస్తున్నా. ఇక ఈ చిత్రంలో ఇరువురు భామ‌ల పాత్ర‌ల్లోనూ స‌స్పెన్స్‌ని రివీల్ చేస్తున్నాం. అస‌లు పూజాను భార్య పాత్ర అని చూపించాం. కానీ ఎక్క‌డా అగ్నిసాక్షిగా హోమం ముందు పెళ్లాడిన‌ట్టు చూపించ‌లేదు. పూజా పాత్ర‌లో ఉన్న స‌స్పెన్స్ ఏంట‌నేది తెరపై చూపిస్తున్నా. ఇక ఆండ్రియా పాత్ర‌లో ఉండే స‌స్పెన్స్ ఎంటో తెర‌పైనే చూడాలి. తీవ్రవాదం అంతం చేసేందుకు వశీం అహ్మ‌ద్ క‌శ్మీరీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ తెర‌పై చూడండి. ఇందులో అమ్మాయి అబ్బాయి ప్రేమ‌క‌థ కాదు. ఎమోష‌న్‌కి ఆస్కారం లేకుండా పూర్తిగా యాక్ష‌న్‌పైనే దృష్టి సారించి తెర‌కెక్కించాం. వ‌శీం అనే మేజ‌ర్ కం రా ఏజెంట్ తీవ్ర‌వాదం అంతానికి ఎలాంటి ఆప‌ర‌రేష‌న్ చేశాడో చూడండి.. అని అన్నారు. విశ్వ‌రూపం 3 తెర‌కెక్కిస్తారా.. ? అంటే అందుకు ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడే చేయ‌ను..అని తెలిపారు. అయితే చేసేందుకు ఆస్కారాన్ని మాత్రం క‌మ‌ల్ కొట్టి పారేయ‌లేదు. వాస్త‌వానికి విశ్వ‌రూపం రెండు భాగాల్ని తొలి రెండు షెడ్యూళ్ల‌లోనే పూర్తి చేశాం. ఒక పాట బ్యాలెన్స్ పాట‌ను త‌ర్వాత చిత్రీక‌రించాను. పూజాకుమార్, ఆండ్రియా పాత్ర‌ల‌కు సంబంధించి చిత్రీక‌ర‌ణ ఇదివ‌ర‌కూ పూర్త‌యింద‌ని క‌మ‌ల్ తెలిపారు. అత‌డు అన్న‌దానిని బ‌ట్టి .. రిలీజ్ ఆల‌స్య‌మైంది కానీ, చిత్రీక‌ర‌ణ నాలుగేళ్ల క్రిత‌మే పూర్త‌యింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

User Comments