డాడ్‌కి కులం కుంప‌టి

Last Updated on by

కులం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోంది. కులం కుంప‌టి కేవ‌లం సామాన్యుల‌కే కాదు, సెల‌బ్రిటీల‌కు ఓ రేంజులో సెగ‌లు పుట్టిస్తోంది. ఆ సెగల్ గిగ‌ల్‌ ఇప్ప‌డు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌ను తాకాయి. క‌మ‌ల్ ఇదివ‌ర‌కూ చేసిన ఓ కామెంట్‌ అతడిని ఇప్ప‌టికీ వెంటాడుతోంది. నా కుమార్తెల పాఠశాల దరఖాస్తు పత్రాల్లో కులాన్ని ప్రస్తావించలేదు. ఆ ఖాళీని వ‌దిలేశాను. ఇలా చేయ‌డం ద్వారానే తర్వాతి తరంలో మార్పు తీసుకురావచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలి. కేరళలో ఇప్పటికే ఈ పద్ధతిని పాటించారు.. అంటూ క‌మ‌ల్ ఇదివ‌ర‌కూ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర‌ విమర్శలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

క‌మ‌ల్ హాస‌న్‌ ‌కుమార్తె, నటి శ్రుతిహాసన్‌ చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కులం గురించి మాట్లాడారు. తాము వైష్ణవులమని శ్రుతి చెప్ప‌డం వీడియోలో స్ప‌ష్టంగా ఉండ‌డంతో ఆ ఇంట‌ర్వ్యూలో ఆ బిట్‌ని క‌ట్ చేసి నెటిజ‌నులు సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. కమల్‌ మీ ప్రయత్నం వృథా అయ్యిందని, ముందు మీ ఇంటి నుంచి మార్పును తీసుకురండని కామెంట్లు చేశారు. మీరు మీ కుమార్తెల పాఠశాల దరఖాస్తు పత్రాల్లో కులాన్ని ప్రస్తావించలేదు. కానీ బహిరంగంగా మీరేంటో చెప్పారు.. అంటూ విలక్షణ నటుడ్ని తిట్టేశారు. క‌మ‌ల్ న‌టించిన విశ్వ‌రూపం 2 రిలీజ్‌కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయుడు సీక్వెల్ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మరోవైపు బిగ్‌బాస్ సీజ‌న్ 2 హోస్ట్‌గా క‌మ‌ల్ బిజీబిజీ.

User Comments