ట్రైల‌ర్: క‌మ్మ రాజ్యం హ‌త్యారాజ‌కీయాల‌పై!

వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రాంగోపాల్ వ‌ర్మ. ఆయ‌న‌ మ‌రోసారి క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అంటూ వివాదాస్ప‌ద రాజ‌కీయ అంశంతో సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్ల‌కు, లిరిక‌ల్ వీడియోలు.. సాంగ్స్ తో క్యూరియాసిటీ పెంచాడు. ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని క‌మ్మ రాజ్యంలోకి క‌డ‌ప‌రెడ్లు ఎలా వ‌చ్చారు? అన్న విష‌యాన్ని చెబుతూనే వ‌ర్తమాన రాజకీయాల‌ను అంత‌కు మించి హైలైట్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. దీనిలో భాగంగా కొన్ని పాత్ర‌ల‌ను ఇప్ప‌టికే రివీల్ చేసారు.

తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేసారు. బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు గెలిచిన బాబు పార్టీ చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ రుచి చూడ‌నంత ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన త‌ర్వాత కొన్ని చాలా విప‌రీత ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి… అంటూ ఆర్జీవీ వాయిస్ ఓవ‌ర్ తో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిస్థితులనే ఎక్కుగా హైలైట్ చేసిన‌ట్లు ట్రైల‌ర్ లో తెలుస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర‌ల‌న్నింటిని ట్రైల‌ర్ లో చూపించేసారు. సీరియ‌స్ గా సాగే పాత్ర‌ల‌ను అంతే సీరియస్ ఎలివేట్ చేస్తూనే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కె.ఏ పాల్ లాంటి వాళ్ల‌ని కామిక్ స్టైల్లో చూపించ‌డం విశేషం. సాధార‌ణంగా వ‌ర్మ సినిమా అంటే బాలీవుడ్ న‌టులు ఎక్కువ‌గా ఉంటారు. కానీ ఇందులో అలీ, ధ‌న‌రాజ్, బ్ర‌హ్మానందం లాంటి క‌మెడీయ‌న్ల పాత్ర‌ల‌కు ప్రాముఖ్య‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో రంగం ఫేం అజ్మ‌ల్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్నారు.