సాయిప‌ల్ల‌విపై బిగ్ పంచ్‌!

Last Updated on by

వ‌రుస స‌క్సెస్‌ల‌తో జోరుమీద ఉంది సాయిప‌ల్ల‌వి. అదే క్ర‌మంలో ప్ర‌తిష్ఠాత్మ‌క లైకా సంస్థ నిర్మించిన `క‌ణం` చిత్రంతో అటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోనూ అదృష్టం చెక్ చేసుకుంది. ఈ సినిమా క‌థాంశం సాయిప‌ల్ల‌వి ఫ్యామిలీ చుట్టూ తిరిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీతో తెర‌కెక్కింది. క‌థాంశం బావుంది. సాయిప‌ల్ల‌వి అద్భుతంగా న‌టించింది. సినిమా ఫ‌ర్వాలేదు! అన్న టాక్ వ‌చ్చింది. అయితే వ‌సూళ్లు మాత్రం ఆశించినంత లేక‌పోవ‌డంతో సాయి ప‌ల్ల‌వికి తొలి పంచ్ ప‌డింది.

ఇక‌పోతే ఈ సినిమాపై తాజాగా కాపీ క్యాట్ వివాదం రాజుకోవ‌డం ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్ అయ్యింది. “క‌ణం క‌థ నాదే. ఇందులో చాలా సీన్లు నేను రాసుకున్న‌వే“ అంటూ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చంద్ర‌కుమార్ త‌మిళ ద‌ర్శ‌క‌సంఘంలో ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పైనా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగానూ కోర‌నున్నాడని తెలుస్తోంది. ఇలాంటి కాపీ క్యాట్ వివాదాలు చాలా కాలంగా చూస్తున్న‌వే. వీటిని ర‌చ‌యిత‌ల సంఘం, ద‌ర్శ‌క‌సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సెటిల్‌మెంట్ చేస్తుంటారు. అయితే క‌ణం విష‌యంలో ఈ వివాదం ఎంత‌వ‌ర‌కూ వెళ్ల‌నుంది? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఇప్ప‌టికైతే దీనిపై క‌ణం నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ స్పందించలేదు. మొత్తానికి వివాదం ఏదైనా ఈ పంచ్ మాత్రం సాయిప‌ల్ల‌విపైనే. ఈ భామ అజేయ‌మైన జైత్ర‌యాత్ర‌కు బ్రేక్‌ ప‌డిన‌ట్టే మ‌రి!

User Comments