`కాంచ‌న 3` తెలుగు రైట్స్ అంత ప‌లికిందా?

Last Updated on by

Last updated on March 11th, 2019 at 02:21 pm

రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలోని మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీగా ముని (కాంచ‌న‌) సిరీస్ గురించి చెప్పుకుంటాం. ఈ సిరీస్ లో కాంచ‌న‌, కాంచ‌న 2 (గంగ‌) బంప‌ర్ హిట్లు కొట్టాయి. ప్ర‌స్తుతం కాంచ‌న 3 సెట్స్ పై ఉంది. ఈ సిరీస్ సినిమాల‌న్నీ హిట్లే కాబ‌ట్టి ప్ర‌స్తుతం కాంచ‌న 3 కి తెలుగులో బంప‌రాఫ‌ర్ త‌గిలింద‌ట‌. ఈ సినిమా తెలుగు రిలీజ్ హ‌క్కుల‌కు రూ.11 కోట్లు ప‌లికింద‌ని తెలుస్తోంది. `పందెంకోడి 2` నిర్మాత ఠాగూర్ మ‌ధు ఈ సినిమా రైట్స్ ని భారీ పోటీలో ఛేజిక్కించుకున్నారు.

కాంచ‌న 3 (ముని 4) ఎప్పుడు రిలీజ‌వుతోంది? అంటే ఏప్రిల్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. మే డే రోజున సెల‌వు ఈ చిత్రానికి క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2017 అక్టోబ‌ర్ లో ప్రారంభ‌మైన ఈ చిత్రం ఇప్ప‌టికి రిలీజ్ కి రెడీ అవుతోంది. గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాని లారెన్స్ మాస్టార్ ప‌క‌డ్భందీ స్క్రీన్ ప్లే తో తీర్చిదిద్దారనే అభిమానులు భావిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ ఫేం ఓవియా కీల‌క పాత్ర‌లో న‌టించింది. వేదిక‌, కొత్తమ్మాయ్ నిఖిత ఇందులో క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇక ఈ ఫ్రాంఛైజీలో కాస్ట్ లీ చిత్రంగా కాంచ‌న‌3 గురించి చెబుతున్నారు.

Also Read: Varun Tej Sharing  Screen Space With Bollywood Actor

User Comments