కాంచ‌న-3 మూవీ రివ్యూ

నటీనటులు: లారెన్స్, వేదిక‌, నిక్కీ తంబోలి త‌దిత‌రులు..
బ్యానర్లు: రాఘ‌వేంద్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ – లైట్ హౌస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: లారెన్స్- ఠాగూర్ మ‌ధు
సంగీతం: డూపాడూ
రచన- దర్శకత్వం: రాఘ‌వ‌ లారెన్స్

సింగిల్ లైన్:
చెడుపై మంచి చేసే యుద్ధం.. దుష్ఠుల‌పై కాంచ‌న రివెంజ్ ఏంటి? అన్న‌దే క‌థాంశం.

ముందు మాట:
రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలోని కాంచ‌న సిరీస్ కి త‌మిళ ఆడియెన్ తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ అంతే క్రేజు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ లో కాంచ‌న‌, కాంచ‌న 2 తెలుగులోనూ బంప‌ర్ హిట్లు కొట్టాయి. అందుకే ఇప్పుడు ఈ సిరీస్ లో వ‌స్తున్న మూడో సినిమా `కాంచ‌న 3` పైనా అంతో ఇంతో అంచ‌నాలేర్ప‌డ్డాయి. లేటుగా వ‌చ్చినా లారెన్స్ మాస్టార్ లేటెస్టుగానే వ‌చ్చారా? ఏదైనా మ్యాజిక్ చేశాడా లేదా? పార్ట్ 3 లో కొత్త‌గా ఏదైనా చూపించాడా? రొటీన్ ఫార్ములాయేనా? అన్న‌ది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
దుష్ఠ శ‌క్తిపై దైవ‌శ‌క్తి పోరాడి నెగ్గ‌డం అన్న‌ది అనాదిగా చూస్తున్న ఫార్ములానే. అయితే ఆస‌క్తిక‌రంగా దుష్ఠ‌శ‌క్తి సైతం దైవ‌శ‌క్తికి స‌లాం కొట్టి దుష్టుల‌పై పోరాటం సాగించ‌డం అన్న‌దే కాస్తంత కొత్త‌. కాంచ‌న అనే ఆత్మ క‌థానాయ‌కుడిలో ప్ర‌వేశించాక దుష్టుల ప‌ని ప‌ట్టే క‌థాంశంతోనే కాంచ‌న సిరీస్ సినిమాల‌న్నీ వ‌చ్చాయి. ఇప్పుడు కూడా అదే బాట‌లో లారెన్స్ మాస్టార్ చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మిది. క‌థాంశంలోకి వెళితే..

దెయ్యాలంటే భ‌య‌ప‌డే రాఘ‌వ‌ (లారెన్స్) త‌న ఫ్యామిలీతో క‌లిసి తాతయ్య‌ ఇంటికి వెళ‌తాడు. ఆ క్ర‌మంలోనే ఫ్లాష్ బ్యాక్ లో చెట్టుపై బంధించిన ఆత్మ లారెన్స్ కుటుంబాన్ని వెంటాడుతుంది. ఈలోగానే లారెన్స్ లైఫ్‌లో ప్ర‌వేశించిన ముగ్గురు అమ్మాయిల (వేదిక‌, తంబోలి, ఓవియా) తో రొమాన్స్.. కోవై స‌ర‌ళ (అమ్మ‌)తో కామెడీ సీన్లు.. వ‌గైరా వ‌గైరా క‌థ న‌డుస్తుంటుంది. వేదిక‌ను హింసించే దెయ్యాన్ని వ‌దిలించే మాంత్రికుడు బ‌రిలో దిగాక అస‌లు క‌థ స్టార్టవుతుంది. అస‌లింత‌కీ ఆ ఆత్మ లారెన్స్ కుటుంబాన్నే ఎందుకు వెంబ‌డించింది? అటుపై లారెన్స్ దేహంలో కాంచ‌న ప్ర‌వేశించాక ఏం జ‌రిగింది? దుష్ఠుల ప‌ని ప‌ట్టేందుకు కాంచ‌న ఏం చేసింది? చివ‌రికి క‌థ ఎలా సుఖాంతం అయ్యింది? అన్న‌దే ఈ సినిమా. ఈ క‌థ‌లో తెల్ల‌ని మాసిన గ‌డ్డంతో కాళి ఎంట్రీ.. కాళిక మాత స‌మ‌క్షంలో కాంచ‌న‌ వీరంగం వ‌గైరా వ‌గైరా ఎపిసోడ్స్ లో దుష్టుడైన మంత్రిని, అత‌డి బ‌ల‌గాన్ని అంతం చేయ‌డ‌మే బ్యాలెన్స్ స్టోరి.

ఈ మొత్తం క‌థ‌ను లారెన్స్ మాస్టార్ తెర‌పై చూపించిన తీరు అత్యంత పేల‌వంగా సాగింది. ముఖ్యంగా కాంచ‌న సిరీస్ క‌థ‌ల్లోనే పార్ట్ 3 క‌థాంశం చెత్త క‌థ‌ అని తేలిపోయింది. క‌థ‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం.. క‌థ‌నంలోని రొటీనిటీ ఏమాత్రం ఆస‌క్తి క‌లిగించదు. కామెడీ పూర్తిగా విఫ‌ల‌మైంది. లారెన్స్ న‌ట‌న‌.. మాస్ సాంగ్స్.. యాక్ష‌న్‌ మిన‌హా ఆక‌ట్టుకునే కొత్త ఎలిమెంట్ ఒక్క‌టీ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్. ఇక ఈ సినిమాని ఆరంభ‌మే ఒక మ‌ర్డ‌ర్.. అటుపై భారీ యాక్ష‌న్ సీన్ తో స్టార్ట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ నెరేష‌న్ లో కాంచ‌న (ఆత్మ‌) రంగ ప్ర‌వేశంతో కొంత గ్రిప్ పెరిగినా ఆ త‌ర్వాతా పేల‌వ‌మైన స‌న్నివేశాల‌తో చుట్టేశారు. గూండాలు కాళీని, కాళి కుటుంబాన్ని అంతం చేయ‌డం అటుపై ప్ర‌తీకారం వ‌గైరా రొటీనిటీతో సాగుతుంది. కొన్ని సెంటిమెంట‌ల్ సీన్స్.. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకున్నాయి. ఓవ‌రాల్ గా చూస్తే గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ సినిమా బిలో యావ‌రేజ్ అనే చెప్పాలి.

నటీనటుల ప్ర‌ద‌ర్శ‌న‌:
లారెన్స్ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. క‌థానాయిక‌లు కేవ‌లం గ్లామ‌ర్ పార్ట్.. పాట‌ల‌ కోసం మాత్ర‌మే. ఇత‌ర పాత్ర‌లు సోసేనే.

టెక్నికాలిటీస్:
నిర్మాణ విలువలు ఫెంటాస్టిక్. కెమెరా వ‌ర్క్ .. రీరికార్డింగ్ ని ప్ర‌శంసించాలి. ఎడిటింగ్ మ‌రింత షార్ప్ గా ఉంటే క‌థ‌నంలో గ్రిప్ పెరిగేది.

ప్లస్ పాయింట్స్:

* లారెన్స్ న‌ట‌న .. యాక్ష‌న్
* సెంటిమెంట్ సీన్స్

మైనస్ పాయింట్స్:

* కామెడీ ఫెయిల్
* రొటీన్ స్టోరి

ముగింపు:
కాంచ‌న 3- రొటీన్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌..ఫ‌న్ లెస్‌.. హార‌ర్ లెస్.. హోప్ లెస్!!

రేటింగ్:
2.0/5

Also Watch: Kanchana 3 Live Review