ఝాన్సీరాణికి ఘ‌న‌ స‌న్మానం

వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ `మ‌ణిక‌ర్ణిక‌` ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, త‌మిళం, హిందీలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్‌కి వారం ముందే దేశ ప్ర‌థ‌మ‌పౌరుడు రామ్ నాథ్ కోవింద్ ఏరికోరి ఓ ప్ర‌త్యేక షోని వీక్షించ‌డం విశేషం. డిల్లీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ షోలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్, భాజ‌పా సీనియ‌ర్ నాయ‌కుడు ఎల్‌.కె.అద్వానీ, క్వీన్ కంగ‌న‌, మ‌ణిక‌ర్ణిక ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్, ప్ర‌సూన్ జోషి త‌దిత‌రులు ఉన్నారు. ప్రివ్యూ అనంత‌రం కంగ‌న‌ను, మ‌ణిక‌ర్ణిక చిత్ర‌బృందాన్ని రామ్ నాథ్ స్వ‌యంగా స‌న్మానించారు. ఇది అరుదైన అవ‌కాశం. కంగ‌న‌కు మాత్రమే ఆ అదృష్టం ద‌క్క‌డాన్ని ప్ర‌శంసించాల్సిందే.

మ‌ణిక‌ర్ణిక ట్రైల‌ర్ ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో దూసుకెళుతోంది. ట్రైల‌ర్ న‌చ్చింది. సినిమాలో కంటెంట్ అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌ణిక‌ర్ణిక వారియ‌ర్ క్వీన్ ఎమోష‌న‌ల్ లైఫ్ జ‌ర్నీ కాబ‌ట్టి తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి యువ‌త‌రంలో ఉంది. అందుకే సినిమాలు చూసే టైమ్ లేక‌పోయినా.. రాష్ట్ర‌ప‌తి అంత‌టి వారు స్వ‌యంగా పిలిపించుకుని మ‌రీ ఈ షోని వీక్షించ‌డం విశేషం.