ఆర్ ఆర్ ఆర్ బ్యూటీపై కంగ‌న క‌త్తి

Last Updated on by

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో చెలిమి చేయ‌డం బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కు కొత్తేం కాదు. టాలీవుడ్ లో రాంగోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎంత‌గా ప్ర‌చారం పొందుతాడో? బాలీవుడ్ న‌టీమ‌ణుల్లో కంగ‌నా అంత‌క‌న్నా డేర్ గా వ్యాఖ్యానాలు చేస్తుంటుంది. హృతి క్ రోష‌న్, స‌ల్మాణ్ ఖాన్ లాంటోళ్ల‌నే బంతేడాసింది. కాస్టింగ్ కౌచ్ అంశంపై వ‌న్ మేన్ ఆర్మీలో విరుచుకుప‌డిన వీర శిరోమ‌ణి. తాజాగా అమ్మ‌డు సాటి న‌టి అలియా భ‌ట్ ను ఉద్దేశించి చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేసి బాలీవుడ్ మీడియా టాలీవుడ్ లోనూ సంచ‌ల‌న‌మైంది. ఓ మీడియా సంస్థ నిర్వహించిన పోల్‌లో ఉత్తమ నటిగా (మ‌ణిక‌ర్ణిక‌) కంగనా రనౌత్ కే నెటిజన్లు ఓటు వేశారు. ఆప్షన్‌లో కంగనతో పాటు ఆలియా పేరు కూడా చేర్చారు.

కానీ నెటిజన్లకు కంగన నటనే నచ్చింది. దీంతో ఆమె విన్న‌ర్ అయింది. అయితే అలియా త‌న‌తో క‌నీసం పోటికి కూడా ప‌నికిరాద‌ని ఈర్ష్య భావాన్యి వ్య‌క్తం చేసింది. ఆలియాతో పోలుస్తున్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ‘గల్లీ బాయ్‌’ సినిమాలో ఏముందని ఆలియా నాతో పాటు ఉత్తమ నటిగా పోటీపడుతుంది? అయినా అమె న‌ట‌న‌ను ఎందుకు మెచ్చుకోవాలి? ఛీ దయచేసి అలియాతో నన్ను పోల్చకండి. స్టార్ కిడ్ ని మీడియా ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది. ఇలాంటి వాళ్ల‌ను ప్రోత్స‌హించ‌డం ఆపండి. లేదంటే అస‌లైన ట్యాలెంట్ బ‌య‌ట‌కు రాదంటూ ఆగ్ర‌హం చెందింది. అలియా భ‌ట్ `ఆర్ ఆర్ ఆర్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Also  Read: Chitralahari  Movie Review

User Comments