కంగ‌న ర‌నౌత్ ను ఆహ్వానించారు

Last Updated on by

ఇప్పుడు కంగ‌న చూపులు చూసిన త‌ర్వాత ప్ర‌తీ అభిమాని కూడా ఇదే అంటాడేమో..? ఎందుకంటే ఆ చూపుల్లో అంత మ‌త్తు ఉంది మ‌రి. బాలీవుడ్ లో వ‌ర‌స విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న కంగ‌న ర‌నౌత్.. బ‌య‌ట వేడుక‌ల్లో కూడా త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటుంది. అందాల ఆర‌బోత‌లో ఈమె త‌ర్వాతే ఎవ‌రైనా..! అభిన‌యంతో అద‌ర‌గొట్టాలన్నా.. అందంతో మ‌తులు చెడగొట్టాల‌న్నా కంగ‌నాకే సాధ్యం.

ఇప్పుడు కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2018 కోసం అద్భుతంగా ముస్తాబు అవ్వబోతుంది. ఈ మధ్యే ఓ ఫోటోషూట్ లో క్లీవేజ్ షోల‌తో అంద‌రి మ‌తులు పోగొట్టేసింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్ లో కంగ‌న ఎలా ఉండాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుందట. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో అమ్మాయిగారు అడీషిన‌ల్ క‌ల‌రింగ్ ఇవ్వడానికి తన డిజైనర్ కుస్తీ పడుతున్నాడు. కంగ‌న ర‌నౌత్ ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక సినిమాతో బిజీగా ఉంది. క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. మార్చ్ లోనే రావాల్సిన ఈ చిత్రం జులైకు వాయిదా ప‌డింది.

User Comments