కంగ‌నా అవ‌తారం అదుర్స్

Last Updated on by

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో కంగ‌న ర‌నౌత్ అవ‌తారం చూసి ఇప్పుడు అంతా ఇదే అనుకొంటున్నారు. అస‌లు ఇలాంటి క్యాస్ట్యూమ్స్ కూడా ఉంటాయా..? ఉంటే ఇలాంటివి వేసుకుని జ‌నాల మ‌ధ్య‌కు వ‌చ్చేస్తారా అనే అనుమానాలు ఇప్పుడు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. లేకపోతే మ‌రేంటి..? ఒక్క‌సారి కంగ‌న ర‌నౌత్ ను చూస్తే మైండ్ గిర్రున తిరిగిపోతుంది. ఇండియ‌న్ హీరోయిన్ అంటే ఖచ్చింత‌గా కాస్తో కూస్తో పద్ద‌తిగా వ‌స్తార‌ని కాన్స్ లో అభిప్రాయం ఉంది. అయితే అది ఇప్పుడు పోగొట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు మ‌న ముద్దుగుమ్మ‌లు.

మొన్న‌టికి మొన్న ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే గ్లామ‌ర్ షో చేసారు.. ఇక ఇప్పుడు త‌న వంతు అన్న‌ట్లు తీసుకుంది కంగ‌న ర‌నౌత్. అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే చిరాకు అన్న‌ట్లుగా రెచ్చిపోయింది ఈ భామ‌. కేవ‌లం లో దుస్తులు మాత్ర‌మే వేసుకుని బ‌య‌ట మొత్తం ప్ర‌పంచానికి వ‌దిలేసింది ఈ భామ‌. క్వీన్ అందాలు చూసి కాన్స్ కూడా మురిసిపోయింది. ఈ ర‌చ్చ ఇలాగే సాగితే కంగ‌న‌ను ప‌ట్టుకోవ‌డం సాధ్యం కాదేమో..?

User Comments