మ‌ణిక‌ర్ణిక నుంచి క్రిష్ ఔట్‌!

Last Updated on by

అవును .. ఇది నిజ‌మేనా? క‌్వీన్ దెబ్బ‌కు క్రిష్ ఔట్ అయ్యాడా? అంటే అవున‌నే ముంబై సోర్సెస్ చెబుతున్నాయి. కంగ‌న క‌థానాయిక‌గా క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `మ‌ణిక‌ర్ణిక` షూటింగ్ ప్ర‌స్తుతం బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్టును ప‌క్క‌న‌పెట్టి క్రిష్ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. అక్క‌డ కంగ‌న ప్ర‌తి విష‌యంలో వేలు పెట్ట‌డంతో అలిగిన క్రిష్ మ‌ధ్యంత‌రంగా వ‌దిలేశాడ‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇక‌పోతే గ‌తంలో వేరొక ప్రాజెక్టు స్క్రిప్టు విష‌యంలో కంగ‌న… ర‌చ‌యిత అస్రానీతో గొడ‌వ ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. టైటిల్స్‌లో కంగ‌న త‌న పేరును ర‌చ‌యిత‌గా వేసుకోవ‌డంతో ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య కోర్టు కేసులు న‌డుస్తున్నాయి.

అదే సీన్ ద‌ర్శ‌కుడు క్రిష్‌కి ఎద‌ర‌య్యేట్టే క‌నిపిస్తోంది. అస‌లేమైందో కానీ, క్రిష్ కాస్తంత డిస్ట్ర‌బ్డ్‌గానే ఉన్నాడ‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. లేటెస్టుగా కంగ‌న‌తో క్రిష్ గొడ‌వ‌ల్ని కన్ఫామ్ చేస్తూ.. మ‌ణిక‌ర్ణిక క్లాప్‌బోర్డ్‌లో `ద‌ర్శ‌క‌త్వం: క‌ంగ‌న‌` అన్న కాల‌మ్ క‌నిపించ‌డంతో క్రిష్ ఫాలోవ‌ర్స్ ఒక్క‌సారిగా ఖంగు తినాల్సి వ‌చ్చింది. అస‌లింత‌కీ క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారా? అయితే క్లాప్‌బోర్డ్‌లో కంగ‌న పేరెలా వ‌చ్చింది? అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి కంగ‌న త‌ర‌పున ప్ర‌తినిధి వేరే కార‌ణం చెబుతున్నాడు. కంగ‌న కేవ‌లం ప్యాచ్ వ‌ర్క్‌కి మాత్ర‌మే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. క్రిష్ వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు క‌దా! అని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే జిత్తుల‌మారి కంగ‌న మాట‌ల్ని న‌మ్మ‌డ‌మెలా? అంటూ ఇక్క‌డ తెలుగు యూత్ మాత్రం అస్స‌లు ఆ మాట‌లే న‌మ్మ‌డం లేదు. అస‌లింత‌కీ మ‌ణిక‌ర్ణిక విష‌యంలో ఏం జ‌రుగుతోంది? ద‌ర్శ‌కుడి మార్పు ఖాయ‌మైందా? జ‌న‌వరి 25న మ‌ణిక‌ర్ణిక రిలీజ్ కావాలంటే కంగ‌న ఈ సీరియ‌స్ నిర్ణ‌యం తీసేసుకుందా? అంటూ ఒక‌టే వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంద‌క్క‌డ‌?

User Comments