మెగాస్టార్ కు అల్లుడంటే ఎంత ప్రేమో..?

Last Updated on by

ఇన్నాళ్లూ విజేత అనే టైటిల్ పై చాలా వార్త‌లు వినిపించాయి. ఓ సారి సాయిధ‌రంతేజ్ సినిమాకు పెడుతున్నార‌ని.. లేదు చ‌ర‌ణ్ సినిమాకు టైటిల్ గా పెడుతున్నార‌ని.. అదీ కాదు వ‌రుణ్ తేజ్ కూడా ఈ టైటిల్ పై క‌న్నేసాడ‌ని.. ఇలా చాలా వార్త‌లే వినిపించాయి. కానీ అల్లుడు ముందు అంద‌రూ సైడ్ అయిపోయారు. చిరంజీవికి చిన్న‌ల్లుడు అంటే భ‌లే ప్రేమ‌. అందుకే క‌దా ఇప్పుడు త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్ ను అల్లుడికి ఇచ్చేసాడు. అదే విజేత‌. తొలి సినిమాతోనే మావ‌య్య‌ను వాడేసుకోవ‌డం మొద‌లుపెట్టాడు క‌ళ్యాణ్.

ఈయ‌న న‌టిస్తోన్న సినిమాకు విజేత టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. జ‌త‌క‌లిసే ఫేమ్ రాకేశ్ శ‌శి ద‌ర్శ‌కుడు. సాయికొర్ర‌పాటి నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో గుర్తింపు తెచ్చుకున్న మాళ‌విక న‌య్య‌ర్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. క‌ళ్యాణ్ కు ఇది తొలి సినిమానే అయినా భారీగానే వ‌స్తుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీకి తోడు నాజ‌ర్, రాజీవ్ క‌న‌కాల‌, ముర‌ళి శ‌ర్మ‌, పోసాని లాంటి వాళ్ల అండ‌దండ‌లు కూడా ఉన్నాయి. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలి మావ‌య్య పేరును.. టైటిల్ ను అల్లుడు ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో..?

User Comments