లెజెండ్ క‌పిల్‌దేవ్ బ‌యోపిక్

Last Updated on by

ప్ర‌స్తుతం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో బ‌యోపిక్‌ల ట్రెండ్ కొన‌సాగుతోంది. సినీ, రాజ‌కీయ రంగాలు, క్రీడారంగంలోని ప్ర‌ముఖుల జీవితాల్ని వెండితెర‌కెక్కించేందుకు ఫిలింమేక‌ర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ప‌లువురు క్రీడాకారుల జీవితాలు వెండితెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఎం.ఎస్‌.ధోని, స‌చిన్ టెండూల్క‌ర్‌, మిల్కాసింగ్, మేరికోమ్ వంటి క్రీడాకారుల బ‌యోపిక్‌లు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద విజ‌యం ద‌క్కించుకున్నాయి.

ఇదే ఊపులో మ‌రో క్రేజీ బ‌యోపిక్‌కి ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ సినిమాకి 83 అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. టైటిల్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తుండ‌గా, క‌పిల్‌ కోచ్ పాత్ర‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. హిందీ, తెలుగు, త‌మిళ్‌లో ఈ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది.

User Comments