రాజ‌మౌళికి క‌ర‌ణ్ జోహార్ బంప‌ర్ ఆఫ‌ర్

Last Updated on by

బాహుబ‌లి సినిమాతో తెలుగు నిర్మాత‌ల‌కు ఎంత లాభం వ‌చ్చిందో తెలియ‌దు కానీ బాలీవుడ్ లో మాత్రం క‌ర‌ణ్ జోహార్ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగానే పెరిగిపోయింది. ఎందుకంటే తొలిభాగాన్ని కేవ‌లం 30 కోట్ల‌కు అటూ ఇటూ తీసుకున్న ఈయ‌న 118 కోట్లు వెన‌కేసుకున్నాడు. ఇక రెండో భాగాన్ని కూడా 100 కోట్ల‌కు పైగా కొంటే ఏకంగా 512 కోట్లు వ‌చ్చాయి. అస‌లు ఈ లాభాలు చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క త‌ప్ప‌వు. ఈ లాభం రాజ‌మౌళికి కూడా ఉంటుంది. క‌ర‌ణ్ జోహార్ తో వాటాల లెక్క‌నే బాహుబ‌లిని అమ్మాడు రాజ‌మౌళి. ఇక ఇప్పుడు ఈయ‌న త‌ర్వాతి సినిమాపై కూడా ఇవే అంచ‌నాలు ఉన్నాయి.

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఇంకా మొద‌ల‌వ్వ‌క ముందే క‌ర‌ణ్ జోహార్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కోసం బేరం పెట్టేసాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 180 కోట్లు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చాడు క‌ర‌ణ్. బాహుబ‌లి అంటే విజువ‌ల్ వండ‌ర్ కాబ‌ట్టి ఓకే కానీ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తెలియ‌క‌పోయినా కేవ‌లం రాజ‌మౌళి బ్రాండ్ తో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ కు ఈ రేట్ ప‌ల‌క‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే. అయితే ఈ చిత్ర రైట్స్ ఎంత‌కు ఇవ్వాలి.. ఇవ్వాలా వ‌ద్దా అనేది మాత్రం నిర్మాత దాన‌య్య‌కే వ‌దిలేసాడు రాజ‌మౌళి. ఆయ‌న ఇష్ట‌మైతే ఇవ్వాలి.. లేదంటే లేదు. ఈ చిత్రాన్ని 300 కోట్ల‌తో నిర్మించ‌నున్నాడు దాన‌య్య‌. అక్టోబ‌ర్ లో మొద‌ల‌య్యే ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుద‌ల కానుంది. విడుద‌ల‌వ్వ‌క ముందే ఇన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఏం చేస్తుందో..?

User Comments