ఫైట‌ర్ టీమ్‌తో క‌ర‌ణ్‌

karan johar dear comrade drama

విజయ్ దేవరకొండ గ‌త కొంత‌కాలంగా ముంబైలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనివెన‌క అంత‌రార్థం ఇదీ అంటూ ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. తాజాగా ఈ ముంబై విజిట్ల వెన‌క టాప్ సీక్రెట్ రివీలైంది. విజ‌య్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. తెలుగు-హిందీ డ‌బుల్ లాంగ్వేజ్ సినిమాల‌కు ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ను ఇటీవ‌ల క‌లిశాడు. ఇక క‌ర‌ణ్ స్వ‌యంగా మ‌న రౌడీని బాలీవుడ్ కి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడ‌ట‌. పూరి-ఛార్మి టీమ్ తో క‌లిసి క‌ర‌ణ్ ఫైట‌ర్ ని బాలీవుడ్ లోనూ ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది.

ఇటు ద‌క్షిణాది అటు హిందీ చిత్ర‌సీమ‌ను దృష్టిలో పెట్టుకునే  ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తార‌ట‌. అలాగే ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా పూరి టీమ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంద‌ట‌. ఇప్ప‌టికే కరణ్ జోహార్ తో పూరి- ఛార్మి జోడీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రం 2020 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరణ్ జోహార్ పేరు ఫైట‌ర్ టైటిల్ కార్డ్స్ లో ప‌డ‌డం ఖాయ‌మ‌న్న ముచ్చ‌ట సాగుతోంది.