Kareena Kapoor Glamour Show at Lux Golden Rose Award

క‌రీనా.. ఎవ‌ర్ గ్రీన్ సొగ‌స‌రి..

Kareena Kapoor Glamour Show at Lux Golden Rose Award

త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే..! ఇది బాగా పాపుల‌ర్ అయిన సామెత‌. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఇది బాగా సూట్ అవుతుంది కూడా. అక్క‌డ పెళ్లైనా.. త‌ల్లైనా తాము చేయాల‌నుకున్న‌దే చేస్తుంటారు కానీ ఒక‌రు చెప్పింది కాదు. ఒక్క‌సారి రెచ్చిపోవాల‌ని ఫిక్సైన త‌ర్వాత నో అడ్డు. ఇప్పుడు క‌రీనా క‌పూర్ కూడా ఇదే చేస్తుంది. సైఫ్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత‌ కొన్నాళ్లు గ్లామ‌ర్ షో కు దూరంగా ఉన్నారు అమ్మాయిగారు. కానీ ఏమైందో ఏమో తెలియ‌దు గానీ కొన్నాళ్ల నుంచి మ‌ళ్లీ రెచ్చిపోతుంది క‌రీనా. గ‌తేడాది వ‌చ్చిన‌ కీ అండ్ కాలో మున‌ప‌టి క‌రీనాను గుర్తుకు చేసింది బెబో. కీ అండ్ కాలో త‌న‌కంటే చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్ తో అదిరిపోయే రేంజ్ లో కెమిస్ట్రీ పండించింది క‌రీనా. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య రిలేష‌న్ ను న్యాచుల‌ర్ గా చూపించ‌డం కోసం లిప్ లాక్ సీన్లు.. హాట్ సీన్ల‌తో సినిమాను నింపేసాడు.

Kareena Kapoor క‌రీనా.. ఎవ‌ర్ గ్రీన్ సొగ‌స‌రి..
ఇక తాజాగా ల‌క్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ ఫంక్ష‌న్ ప్ల‌స్ ఆ పేప‌ర్ మ్యాగ‌జైన్ కోసం మ‌రోసారి వేడి రాజేసింది క‌రీనా. చిట్టిచిట్టి క్యాస్ట్యూమ్స్, మ‌తులు పోయేలా క్లీవేజ్ షోలు చూస్తుంటే క‌రీనా తెగింపుకు నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లై ఉండి కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డం ఇప్పుడు బాలీవుడ్ లో చాలా మంది చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. క్లీవేజ్ షోల‌తో కిర్రెక్కించింది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్య కాలంలో క‌రీనా ఈ స్థాయిలో కాక పుట్టించ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్యే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రీనా.. మ‌ళ్లీ జిమ్ కు వెళ్లి 20 కేజీలు త‌గ్గి నాజూగ్గా మారిపోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టికైనా క‌రీనా షోకు సైఫ్ అడ్డుక‌ట్ట వేస్తాడో లేదంటే ఆన‌క మాట్లాడ‌కుండా చూస్తుండి పోతాడో..?

క‌రీనా.. ఎవ‌ర్ గ్రీన్ సొగ‌స‌రి..
0 votes, 0.00 avg. rating (0% score)