పిక్‌టాక్‌: టీ ఒల‌క‌బోయ‌క‌మ్మోవ్

Last Updated on by

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్
ఈ ఛాయ్ గలాసుకీ జై జై ..ఛాయ్!!
మెగాస్టార్‌ చిరంజీవి ఛాయ్ గురించి వ‌ర్ణించిన తీరు అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌మా? గ‌రీబోడి ఛాయ్ గురించి మా గొప్ప‌గా చెప్పారు మెగా బాస్‌. మృగ‌రాజు సినిమా ఫ్లాపైనా, ఆ పాట మాత్రం బంప‌ర్‌హిట్‌. ఇప్ప‌టికీ ఛాయ్ అన్న కేక వినిపించ‌గానే బాసు, ఆయ‌న చేతిలోని టీ-గ్లాసు గుర్తుకు రావాల్సిందే. అంత‌టి ప్ర‌భావ‌వంత‌మైన ఛాయ్‌ని ఇదిగో ఈవిడేంటి ఇలా సింపుల్‌గా ఆఫ‌ర్ చేసేస్తోంది. అస‌లు కొంచెమైనా ఆవిడ‌లో సిగ్గు శ‌రం లేదా? గ‌రీబు తాగే ఛాయ్‌ని ప‌టౌడీ కోడ‌లు తాగుతోందే..!? .. ప్చ్ .. అదింత‌కీ అల్లం ఛాయా?  యాల‌కుల టీనా? ఇప్పుడే తేలాల్సిందే. వీరే ది వెడ్డింగ్ ప్ర‌మోష‌న్స్‌లో ది గ్రేట్ క‌రీనా ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది… టీ ఆఫ‌ర్ చేస్తూ..!!

User Comments