కరీనా సోనమ్ ల అడల్ట్ మూవీ చదివింపులు

Last Updated on by

పెళ్లి అయిన త‌ర్వాత అంతా గిఫ్టులు ఇస్తుంటారు క‌దా..! కొంద‌రు డ‌బ్బులు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. బాలీవుడ్లో ఓ పెళ్లికి ఇప్పుడు భారీగా డ‌బ్బులు చ‌దివిస్తున్నారు ప్రేక్ష‌కులు. అది కూడా కోట్ల‌లోనే..! ఆ పెళ్లి ఎవ‌రిదో కాదు.. క‌రీనా, సోన‌మ్ లాంటి స్టార్ హీరోయిన్లు న‌టించిన వీరి ది వెడ్డింగ్ సినిమాది. శ‌శాంక్ ఘోష్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బూతులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తొలిరోజే టాక్ వ‌చ్చింది. పైగా ఏ స‌ర్టిఫికేట్ సినిమా కావ‌డంతో ఎంత‌మందికి రీచ్ అవుతుందో అనే చిన్న అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఈ చిత్రం వ‌సూళ్లు చూసి అంతా షాక్ అవుతున్నారు.

మూడు రోజుల్లోనే ఇండియాలో 37 కోట్ల నెట్ వ‌సూలు చేసింది.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ లెక్క 50 కోట్లు దాటేసింది. ఇంటా బ‌య‌టా ఈ చిత్రానికి వ‌సూళ్ల పంట పండుతుంది. 2018 టాప్ గ్రాస‌ర్స్ లో ఐదో స్థానంలో నిలిచింది వీరి ది వెడ్డింగ్. పెళ్లైన త‌ర్వాత అమ్మాయిల జీవితం ఎలా ఉంటుంది.. పెళ్లి కోసం వాళ్లు ప‌డే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే విష‌యాన్ని చాలా బోల్డ్ గా చెప్పాడు శ‌శాంక్. సోన‌మ్, క‌రీనా, స్వ‌ర‌భాస్క‌ర్, శిఖ త‌స్వాడియా ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమానే అయినా ప్రేక్ష‌కులు మాత్రం దాన్ని హీరో సెంట్రిక్ మూవీలాగే తీసుకుంటున్నారు. ఫుల్ ర‌న్ లో ఈ చిత్రం 100 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

User Comments