ఫోటోటాక్‌: త్రీఇడియ‌ట్ సిస్ట‌ర్స్‌

Last Updated on by

ఆ ముగ్గురు అక్క‌చెల్లెళ్లు ఎంతో స్పెష‌ల్‌. ఆ ముగ్గురికి ఇంకో ఇద్ద‌రు అక్క‌జెల్లెళ్లు ఉన్నారు. మొత్తం ఐదుగురు.. ఈ ఐదుగురితో పాటు వేరొక చెల్లి కూడా ఉంది. అంద‌రినీ క‌లుపుకుంటే ఆరుగురు. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది ఆ ఆరుగురు. ఇంకా ఆ ఇంట్లో ఎంత‌మంది అక్కలు, చెల్లెళ్లు ఉన్నారో స‌న్నిహితులకు మాత్ర‌మే ఎరుక‌! ఇదంతా ఏ కుటుంబం గురించి అంటే ది గ్రేట్ క‌పూర్ ఫ్యామిలీ గురించే.

బోనీక‌పూర్‌- అనీల్ కపూర్ బ్ర‌ద‌ర్స్ కుటుంబంలో అంతా ఆడ‌పిల్ల‌లే. అంద‌రూ ఈడొచ్చిన పిల్ల‌లే. పెళ్లిళ్ల‌కు రెడీగా ఉన్నారు. ముందుగా సోన‌మ్‌కి పెళ్ల‌వుతోంది. ఆ ఇంట్లో తొలి పెళ్లి భాజా సోన‌మ్‌దే! ఇన్నాళ్లు ఫ్యాష‌న్ ప్ర‌పంచానికి భాజా మోగించిన సోన‌మ్ మెడ‌లో మూడు ముడులు వేసేందుకు దిల్లీకి చెందిన అహూజా బోయ్ ఆనంద్ ప్రిపేర‌వుతున్నాడు. ఓవైపు పెళ్లిప‌నుల హ‌డావుడి సాగుతున్నా.. సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టు.. ఇదిగో ఇక్క‌డ క‌పూర్ సిస్ట‌ర్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదుగా! త్రీ ఇడియ‌ట్స్‌లా త్రీ సిస్ట‌ర్స్ ఓ రేంజులోనే ఫోజులిచ్చారు.

ప్ర‌ఖ్యాత బ్రైడ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీపై క‌పూర్‌ సిస్ట‌ర్స్ క‌రీనా క‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, రియా క‌పూర్ ఇలా ఫోజులిచ్చారు. బోనీక‌పూర్‌కి ముగ్గురు కూతుళ్లు. అందులో పెద్ద భార్య‌కు ఒక కొడుకు, కూతురు. శ్రీ‌దేవికి జ‌న్మించిన జాన్వీ, ఖుషీ అదనం. అనీల్ క‌పూర్‌కి గారాల ప‌ట్టీలు రియా, సోన‌మ్. అన్న‌ట్టు చెప్ప‌డం మ‌ర్చిపోయాం.. వీళ్లంద‌రికీ పెద్ద‌క్క క‌రిష్మా క‌పూర్ ఇదివ‌ర‌కే పెళ్లి చేసుకుంది. ఇటీవ‌లే భ‌ర్త‌కు విడాకులు కూడా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రిష్మా త‌న మ‌న‌సుకు చేరువైన వేరొక బిజినెస్‌మేన్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉందని బాలీవుడ్‌లో ప్ర‌చార‌మ‌వుతోంది.

User Comments