Last Updated on by
రూపలావణ్యం కాపాడుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందుకు ఎంతో నిబద్ధత కావాలి. నిత్యం జిమ్ముకెళ్లాలి. కసరత్తులు చేయాలి. ఏంజెలినా లాంటి కథానాయిక ప్రత్యేకమైన మెడిసిన్ ఉపయోగిస్తుందని ఓ డాక్టర్ టాప్ సీక్రెట్ లీక్ చేశాడు. అలాంటి కనికట్టు విద్యలు అయినా ప్రదర్శించాలి. అయితే వయసు ఎంత మీద పడుతున్నా.. ఎలాంటి మందు అవసరం లేకుండానే బెబో కరీనా దేవాతా సుందరి రూపాన్ని ఎలా కాపాడుకోగలుగుతోంది? .. ఈ ప్రశ్నకు సమాధానం రాక, అంతుచిక్కక కన్నెపిల్లలంతా ఆ రహస్యం కనుక్కునే పనిలో పడ్డారు.
ఇదిగో ఇక్కడ కరీనా రూపం చూడగానే మోనాలిసాకు జెరాక్స్ కాపీవా? లేక వేలువిడిచిన మేనత్త కూతురువా? అని అడగాలనిపించడం లేదూ? ఇలా చూశాక ఈవిడను ఎవరైనా బిడ్డ తల్లి అని అనగలరా? ఓవైపు తైమూర్ రాజా బుడిబుడి నడకలతో పెద్దవాడైపోతుంటే, మరోవైపు తీరిక సమయాన్ని బెబో ఎంత తెలివిగా ఉపయోగిస్తోందో? కోల్పోయిన పాత రూపాన్ని తిరిగి తెచ్చేసుకుంది. ఇప్పుడు అప్పటిలానే సైజ్ జీరో కరీనాయే! టీనేజీ గాళ్, కాలేజీ గాళ్స్ సైతం కుళ్లుకునే కరీనాయే. నాచురంగులో మిరుమిట్లు గొలిపే చీరలో డైమండ్ మెరుపులతో ఆ చీరలో కరీనా అదిరిపోయింది. సోనమ్ కపూర్ పెళ్లిలో ఎందరు అతిధులు ఉన్నా.. యూత్ కళ్లన్నీ బెబోపైనే. ఓవైపు సోనమ్ గ్లింప్స్, మరోవైపు జాన్వీ, ఖుషీ గ్లింప్స్ అవన్నీ కరీనా ముందు వెలవెలబోయాయి అంటే అతిశయోక్తి కాదు! ప్చ్!!!
User Comments