బ‌యోపిక్‌తో శీకాకుళం త‌డాఖా

Last Updated on by

శీకాకుళం – శీకాకుళం బ‌యోపిక్ .. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ ఇది. శ్రీ‌కాకుళం వెయిట్ లిఫ్ట‌ర్ .. ఒలింపిక్ విజేత‌ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత‌క‌థ‌ను శ్రీ‌కాకుళం లేడీ డైరెక్ట‌ర్ సంజ‌న డైరెక్ట్ చేసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. శ్రీ‌కాకుళంలోని ఓ ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన ది గ్రేట్ ఒలింపిక్ విజేత క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ తెరకెక్కించే ఆలోచ‌న చేయ‌డ‌మే గ్రేట్ అనుకుంటే.. ఒక పేద కుటుంబం నుంచి అసాధార‌ణంగా ఎదిగిన రియ‌ల్ ట్యాలెంట్‌పై సినిమా తీయాల‌న్న ఆలోచ‌న‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

శీకాకుళం అంటూ ఇండ‌స్ట్రీలో వెట‌కార‌మాడేవాళ్లంద‌రికీ ఇదో చెంప పెట్టు అవుతుందేమో చూడాలి. ఇదివ‌ర‌కూ హ్యాపీడేస్‌లో శీకాకుళం యాస‌తో ఓ పాత్ర‌ను క్రియేట్ చేశారు. ఆ త‌ర‌వాత అదే యాస‌తో సాయికిర‌ణ్ అడివి- దిల్‌రాజు ఓ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్పుడు వీళ్లంద‌రికీ కోటింగ్ ఇచ్చేలా క‌ర‌ణం పాత్ర‌ను సంజ‌న తీర్చిదిద్దుతుందేమో చూడాలి. ఎక్క‌డో రాష్ట్రం చివ‌రిలో.. రాజ‌ధానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండే శ్రీ‌కాకుళంలో ప‌ట్టుద‌ల‌, ప్ర‌తిభ‌కు కొద‌వేం లేద‌ని క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి నిరూపించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకున్నారు. `రాజుగాడు` చిత్రంతో వెలుగులోకి వ‌చ్చిన న‌వ‌త‌రం ట్యాలెంటు సంజ‌న రెడ్డి ఈ చిత్రాన్ని ఏ స్కేల్‌లో తెర‌కెక్కిస్తారు? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.

User Comments