పొలిటిక‌ల్ వార్: స్టార్ హీరోల‌కు బెదిరింపులు

Last Updated on by

ఐదు రాష్ర్టాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఆయా రాష్ర్టాల్లో వేడెక్కింది. ఎన్న‌డు లేని విధంగా ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో సెల‌బ్రిటీలు హాట్ టాపిక్ అవుతున్నారు. రెగ్యుల‌ర్ పోలిటిషీన్ల‌కు షాకిస్తూ… అన్ని చోట్ల‌ రాజ‌కీయ తెరంగేట్రం చురుకు గా జ‌రుగుతోంది. అయితే రంగుల ప్ర‌పంచంలో సుఖాలు చూసిన సెలబ్రిటీలు రాజ‌కీయాలు చేయ‌డానికి ప‌నికొస్తారా? అంటూ ఇప్ప‌టికే ప్ర‌త్య‌ర్ధి పార్టీలు జ‌న‌సేనాని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌న్న‌డ స్టార్ హీరోలు రాకింగ్ స్టార్ య‌శ్, ద‌ర్శ‌న్ ల‌ను విమ‌ర్శించ‌డమే కాకుండా పార్టీల త‌రుపున ప్ర‌చారం చేస్తే బాగుండ‌ద‌ని బెదిరింపులు దిగుతున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. వాస్త‌వానికి య‌శ్ ని చంపేస్తామంటూ ఆ మ‌ద్య ఓవ్య‌క్తి బెదిరింపు కు దిగిన‌ట్లు ఓ వార్త వ‌చ్చింది.

దీన్నీ య‌శ్ అలాంటిదేమి లేద‌ని బ‌ధులిచ్చాడు. తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి య‌శ్ కు బెదిరింపులు ఎదుర్కొన్న మాట వాస్త‌వ‌మేన‌ని తెలుస్తోంది. మాండ్య లోక్ స‌భ నుంచి స్వ‌తంత్ర్య అభ్య‌ర్దిగా సుమ‌ల‌తో బ‌రిలోకి దిగుతోన్న నేప‌థ్యంలో య‌శ్, ద‌ర్శన్ లు ఆమెకు మ‌ద్ద‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. అదేస్థానానికి సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు, న‌టుడు నిఖిల్ గౌడ కూడా పోటీ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆ సీట్ కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. సుమ‌ల‌త నామినేష‌న్ వేసిన స‌మ‌యంలో య‌శ్, ద‌ర్శ‌న్ లు ప‌క్క‌నే ఉన్నారు. దీంతో జేడీఎస్ నేత‌ల‌కు గుబులు ప‌ట్టుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యే నారాయ‌ణ గౌడ్ హీరోలిద్దర్నీ ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. హీరోలిద్ద‌రూ ఇలాగే ఉంటే త‌గిన గుణ‌పాటం చెప్పాల్సి ఉంటుంది. న‌టుల అక్ర‌మ జాత‌కాల‌ను బ‌య‌ట పెడ‌తాడ‌న‌ని, సినిమా వాళ్లు షూటింగ్ లు త‌ర్వాత ఇళ్ల‌లో ఉండాలి త‌ప్ప‌! బ‌య‌ట‌కొచ్చి తిర‌గ‌కూడ‌దంటూ హెచ్చ‌రించాడు.

User Comments