స‌క్సెస్‌మీట్‌కి ఆటోలో

Last Updated on by

ప‌డ‌వ లాంటి మెర్సిడెస్ బెంజ్‌లో దిగాల్సిన హీరో ఉన్న‌ట్టుండి ఆటోలో దిగి స‌ర్‌ప్రైజ్‌నిచ్చాడు. ఆయ‌నేమైనా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తినా.. అంత సింపుల్‌గా దిగిపోవ‌డానికి?.. అంటే అదీ కాదు. సౌత్‌లోనే టాప్ హీరోల్లో ఒక‌డిగా వెలిగిపోతున్న హీరో. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటే ఆవారా కార్తీ.

కార్తీ న‌టించిన చిన‌బాబు ఇటీవ‌లే రిలీజై చ‌క్క‌ని ఓపెనింగులు ద‌క్కించుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వ‌సూళ్లు సాగిస్తోంద‌ని చెబుతున్నారు. కార్తీ ఈ చిత్రంలో వ్య‌వ‌సాయం చేసుకునే రైతు పాత్ర‌లో న‌టించాడు. త‌న సినిమాని కార్తీ ఊరూ వాడా తిరిగి మ‌రీ ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌కి కార్తీ ఎటెండ్ అయ్యాడు. అయితే చిన‌బాబు ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మానికి ఆల‌స్యంగా వ‌చ్చిన కార్తీ గురించి మీడియాలో కొంత డిస్క‌ష‌న్ సాగింది. అయితే హైదరాబాద్‌లో వ‌ర్షం దెబ్బ‌కు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న కార్‌ని అక్క‌డిక‌క్క‌డే వ‌దిలేసి, ఆటోలో ప్ర‌సాద్ ల్యాబ్ ముందు దిగి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు కార్తీ. మొత్తానికి చిన‌బాబు అనిపించాడు. అదీ సంగ‌తి.

User Comments