ఖాకీ ఇంత‌కీ హిట్టా.. ఫ‌ట్టా..?

చెలియా సినిమాతో అనుకోని ఫ్లాప్ అందుకుని రేస్ లో వెన‌క‌బ‌డ్డాడు కార్తి. అలాంటి టైమ్ లో వ‌చ్చిన సినిమా తీరాన్ అధిగారం ఒండ్రు. తెలుగులో ఖాకీగా విడుద‌లైంది ఈ చిత్రం. కార్తి సినిమాల‌కు త‌మిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంటుంది. ఖాకీ సినిమాతో మ‌రోసారి ఇది ప్రూవ్ అయింది. గ‌తేడాది కూడా ఊపిరి, కాష్మోరా లాంటి విజ‌యాలు అందుకున్నాడు కార్తి. తెలుగులో ఖాకీ చిత్రాన్ని 5 కోట్ల‌కు కొన్నారు. ప్ర‌మోష‌న్ తో క‌లిపి ఆ ఖ‌ర్చు 6 కోట్ల‌కు చేరింది.. వ‌సూళ్లు 5 కోట్ల వ‌ర‌కు వ‌చ్చాయి. బ‌య్య‌ర్ల‌కు స్వ‌ల్ప న‌ష్టాలు తీసుకొచ్చింది కానీ డ‌బ్బింగ్ సినిమాకు ఇన్ని క‌లెక్ష‌న్లు రావ‌డం మాత్రం విశేష‌మే

తెలుగులో ఎలా ఉన్నా.. త‌మిళ‌నాట మాత్రం తీరాన్ అధిగారం ఒండ్రు మంచి విజ‌య‌మే సాధించింది. అక్క‌డ 30 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. కార్తి ఇమేజ్ కు ఇది ఎక్కువే అక్క‌డ. ఒక్క చెన్నై సిటీలోనే 6 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కార్తి కెరీర్ లోనే ఇవి హైయ్య‌స్ట్ వ‌సూళ్లు. స‌తురంగ వెట్టై లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వినోద్ తెర‌కెక్కించిన చిత్రమిది. 1995-2000 మ‌ధ్య‌లో చెన్నైలో జ‌రిగిన వాస్త‌విక ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కించాడు వినోద్. దొంగ‌ల ముఠా-పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగే పోరాటమే ఖాకీ. ర‌కుల్ ప్రీత్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. మొత్తానికి ఖాకీ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకోక‌పోయినా హిట్ అనే మాట ద‌గ్గ‌ర ఆగిపోయింది.

User Comments