వైయ‌స్ జ‌గ‌న్ పాత్ర‌లో కార్తీ

Last Updated on by

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం వెండితెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. యాత్ర అనేది టైటిల్. మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. టైటిల్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. వైయస్సార్ జ‌యంతి వేళ రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ అభిమానుల్లోకి బాణంలా దూసుకెళ్లింది. వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నారని వార్తలు వెలువడినా ఇంత‌వ‌ర‌కూ ఇవేవీ అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు.

వైయ‌స్ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ‌న‌టుడు సూర్య క‌న్ఫామ్ అయ్యార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సూర్య సోద‌రుడు కార్తీ ఫైన‌ల్ అయ్యాడ‌ని సోష‌ల్ మీడియాలో ఒక‌టే ప్ర‌చారం సాగుతోంది. తెలుగు, త‌మిళ్‌లో సుప‌రిచితుడైన కార్తీ వ‌ల్ల రెండుచోట్లా ప్ల‌స్ అవుతుంద‌ని యూనిట్ భావిస్తోందిట‌. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 జనవరిలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

User Comments