బ‌ర్నింగ్ స్టార్ ని హ‌ర్ట్ చేసిన కార్తికేయ‌

Bigg Boss Contestants Come together for Sampoo

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు క‌థానాయ‌కుడి సాయి రాజేష్ నీలం కొబ్బ‌రి మ‌ట్ట చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారం లో భాగంగా కొన్ని ప్ర‌మోల‌ను కూడా రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాలో ఓ స‌న్నివేశాన్ని యంగ్ హీరో కార్తికేయ న‌టించిన హిప్పీ సినిమాలో వాడారు. థియేట‌ర్ ల కార్తికేయ కొబ్బ‌రి మ‌ట్ట‌ను చూస్తూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతాడు. ఈ సన్నివేశాన్ని రాజేష్ ట్విట‌ర్లో షేర్ చేస్తూ న‌న్ను టార్గెట్ చేసిన స‌న్నివేశాన్నిచూశాను. అందుకు హిప్పీ సినిమా తీసిన ద‌ర్శ‌కుడిని త‌ప్పుబ‌ట్ట‌ను. కానీ స‌న్నివేశాన్ని రాసిన ర‌చ‌యిత‌కు, న‌టించిన మీకు తెలియాల్సింది ఏమంటే? ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు కాబ‌ట్టి సినిమాను, స‌హ న‌టుల‌ను గౌర‌వించండి అని పేర్కొన్నాడు.

అలాగే దీనిపై సంపూ కూడా రియాక్ట్ అయ్యాడు. కార్తికేయ నా మీద జోకులు వేసినా ప‌ర్వాలేదు. తిట్లు..అవ‌మానం నాకు కొత్తేం కాదు. కానీ విడుద‌ల కాని సినిమా గురించి ఇలా మాట్లాడ‌టం న్యాయం కాదు. మేము ఎన్నో బాధ‌లు ప‌డి ఈసినిమా చేసాం. మీరు ఇలా చేయ‌డం చాలా బాధ‌గా అనిపిస్తుంద‌ని వాపోయాడు. మ‌రి వీటిపై కార్తికేయ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.