జక్క‌న్న వార‌సుడి పెళ్లి వెన్యూ

Last Updated on by

ఓవైపు దీపిక‌, ప్రియాంక చోప్రా పెళ్లి గురించి వేడెక్కే చ‌ర్చ సాగుతోంది. ఇట‌లీ లోక్ కోమోలో దీపిక -ర‌ణ‌వీర్ జంట పెళ్ల‌య్యింది. పీసీ-నిక్ జంట జోద్‌పూర్ ఉమైద్ భ‌వన్‌లో పెళ్లాడుకున్నారు. ఇదే తీరుగా మ‌రో భారీ వెడ్డింగ్ ఈవెంట్‌కి తెర‌లేచింది. ఈసారి టాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖుని వివాహ‌మ‌హోత్స‌వం. సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి వార‌సుడు కార్తికేయ త‌న స్నేహితురాలు పూజా ప్ర‌సాద్‌ని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడు రామ్‌ప్ర‌సాద్ కుమార్తె. సెప్టెంబ‌ర్‌లో నిశ్చితార్థం అయ్యింది. ఇరుకుటుంబాల‌పెద్ద‌లు డిసెంబ‌ర్ 30న తాళిక‌ట్టు ముహూర్తం ఫిక్స్ చేశార‌ట‌.

తాజాగా వెన్యూ ఫిక్స‌య్యింది. ఈ వెన్యూ పీసీ వెన్యూని కొట్టే రేంజు వెన్యూ అని తెలుస్తోంది. జైపూర్ లో మొఘల్ రాజుల భవనాన్ని త‌ల‌పించే హోటల్ ఫెయిర్ మాంట్ లో ఈ వేడుక సాగ‌నుంద‌ట‌. ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పించే ఈ 7 స్టార్ హోట‌ల్ 250 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంద‌ట‌. ఇక్క‌డ లేని సౌక‌ర్య‌మే లేదు. ఇక‌పోతే ఈ పెళ్లికి ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మల నుంచి టాప్ గెస్ట్స్ అటెండ్ అవుతార‌ని తెలుస్తోంది.

User Comments