`క‌థానాయ‌కుడు` ఫ‌స్ట్ రిపోర్ట్‌

Last Updated on by

నందమూరి అభిమానుల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తోంది. `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రం ఈరోజే భారీ స్థాయిలో విడుదలై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈ సినిమా స్పెష‌ల్ ట్రీట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బెనిఫిట్ షోల రూపంలో సినిమాను ప్రదర్శించారు. మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడని, ఎన్టీఆర్ జీవితాన్ని మరోసారి గుర్తు చేశారని అభిమానులు అంటున్నారు. దర్శకుడు క్రిష్ కూడా సినిమాని అద్భుతంగా తెరకెక్కించి.. తగిన న్యాయం చేశారని టాక్ వచ్చింది. ఓపెనింగ్ వసూళ్లు కూడ బ్రహ్మాండంగా ఉండటంతో ఈ సంక్రాంతికి బాలయ్య తన సినిమాతో శుభారంభాన్ని ఇచ్చినట్లే.

ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న టాక్ ను బట్టి చూస్తే… ఎన్టీఆర్ గెటప్ లలో బాలయ్య నటన గొప్పగా ఉందని.. ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అలాగే.. ప్రత్యేకించి కొన్ని సన్నివేశాల్లో బాలయ్య నటనను భేష్ అనిపించేలా పండించారని టాక్ వినిపిస్తోంది. అందులో దివిసీమ ఉప్పెన సన్నివేశం.. శ్రీ‌కృష్ణ భ‌గ‌వంతుడి అవ‌తారం.. ముగింపులో వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రకటన సన్నివేశం. ఈ రెండు సీన్లు మంచి భావోద్వేగాలతో చక్కగా అమరినట్లు.. ఇవి సినిమాకే హైలెట్ గా నిలిచినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా అమెరికాలో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రీమియర్‌ షో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకుప్రదర్శించారు. దీని ద్వారా వచ్చిన వసూళ్లతో `యన్‌టిఆర్‌` సినిమా 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) వసూలు చేసింది. దీంతో ఈ రికార్డ్ బాలకృష్ణ నటించిన`గౌతమిపుత్ర శాతకర్ణి` అక్కడ ప్రీమియర్‌ షో వసూళ్లను `క‌థానాయ‌కుడు` బీట్‌ చేసింది. మొత్తానికి ఈ సినిమా మునుముందు ఎన్ని రికార్డ్ లను బద్దలు కొట్టనుందో వేచి చూడాలి.

User Comments