బుల్లి తెర‌పై క‌థానాయ‌కుడు!

Last Updated on by

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ .. అన్న‌గారు ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు పేరుతో వెండితెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ లో తొలి భాగం క‌థానాయ‌కుడు ఇటీవ‌లే రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. నంద‌మూరి అభిమానులు క్రిష్ ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించారు. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా ఫ్లాప్ షోగా నిలిచింది.

ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంద‌ని తెలుస్తోంది. అంటే రిలీజైన నెల‌రోజుల్లోనే టీవీక్ష‌కుల‌కు, నెటిజ‌నులకు క‌థానాయ‌కుడు చిత్రం అందుబాటులోకి వ‌చ్చేస్తోంది. ఆస‌క్తిక‌రంగా ఫిబ్ర‌వ‌రి 7న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో రెండో భాగం మ‌హానాయ‌కుడు రిలీజ‌వుతుంద‌న్న స‌మాచారం ఉంది. ఫిబ్ర‌వ‌రి 7 లేదా ఫిబ్ర‌వ‌రి 14 అంటూ ప్ర‌స్తుతానికి రిలీజ్ తేదీపై డైలెమా నెల‌కొంది. మ‌హానాయ‌కుడు నిర్మాణానంత‌ర ప‌నులు ప్ర‌స్తుతం వేగంగా పూర్త‌వుతున్నాయి. బుల్లితెర‌పై ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు అందుబాటులోకి వ‌చ్చేస్తోంది అంటే ఇప్ప‌టికీ ఈ చిత్రం వీక్షించ‌ని అభిమానుల‌కు ఇది శుభ‌వార్త‌నే. కోట్లాది మంది అమెజాన్ ప్రైమ్ లో వీక్షించే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read: Tragedy Of NTR Kathanyakudu At USA Box Office

User Comments