క‌త్తి కాంతారావ్ బ‌యోపిక్‌

Last Updated on by

1950-71 మ‌ధ్య క‌త్తి కాంతారావు హ‌వా గురించి తెలిసిందే. క‌త్తి ఝ‌లిపించే వీరాధివీరుడిగా ఆయ‌న స్టైల్ వేరొక‌రికి రాదు. ఎన్టీఆర్‌ త‌ర‌వాత జాన‌ప‌ద చిత్రాల క‌థానాయ‌కుడిగా.. అంత‌టి పేరుంది ఆయ‌న‌కు. కాంతారావు తెలంగాణ వాసి. స్వ‌స్థ‌లం గుదిబండ విలేజ్‌. ప్ర‌స్తుతం అక్క‌డ కాంతారావు జీవిత‌ క‌థ‌పై గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు ద‌ర్శ‌కుడు పీసీ ఆదిత్య‌. సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి` విజ‌యం సాధించిన నేప‌థ్యంలో బ‌యోపిక్‌ల‌పై ఆస‌క్తి పెరిగింది. ఆ క్ర‌మంలోనే కాంతారావు జీవితాన్ని వెండితెర‌కెక్కించేందుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత పీసీ ఆదిత్య స‌న్నాహాలు చేస్తున్నారు. కాంతారావ్ బ‌యోపిక్‌కి.. ఆయన ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టే `అన‌గ‌న‌గా ఓ రాకుమారుడు` అనే టైటిల్‌ని నిర్ణ‌యించారు.

మ‌హాన‌టి స‌క్సెస్ చూపిన దారిలో ప‌లు బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతున్నాయి. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, వైయ‌స్సార్‌, దాస‌రి బ‌యోపిక్‌లు ప్ర‌స్తుతం ప‌ట్టాలెక్కుతున్నాయి. ఆ క్ర‌మంలోనే క‌త్తి కాంతారావ్ బ‌యోపిక్ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇక‌మీద‌ట రాజ‌నాల‌, ఎస్వీఆర్‌, అంజ‌లీదేవి, కైకాల స‌త్య‌నారాయ‌ణ బ‌యోపిక్‌లు తీస్తారా? అన్న‌ది వేచి చూడాలి. ది గ్రేట్ కామెడీ ఆర్టిస్టులు అల్లు రామ‌లింగ‌య్య‌, రాజ‌బాబు బ‌యోపిక్‌లు తీయాల‌ని కోరుకుందాం.

User Comments