ఐపీఎల్ తుదిపోరు.. క‌త్తి దిగేస్తోంది

Last Updated on by

ఐపీఎల్ టోర్నీ ర‌స‌ప‌ట్టులో సాగిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌ల మ‌ధ్య‌లో బాలీవుడ్ నాయిక‌ల గ్లింప్స్‌, ఫ్రాంఛైజీ ఓన‌ర్ల‌యిన అందాల నాయిక‌ల గ్లింప్స్‌ని అభిమానులు ఓ రేంజులో క్యాచ్ చేశారు. ఇక అనుష్క శ‌ర్మ అయితే వీనుల‌విందైన బౌన్స‌ర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగిపోయింది. మ‌గడు విరాట్టుడు మైదానంలో ఏ విన్యాసం చేసినా, ఈ అమ్మ‌డు స్టేడియంలో స్పెష‌ల్ సెల‌బ్ గ్యాల‌రీ ద‌ద్ద‌రిల్లిపోయేలా, చెవులు ప‌గిలిపోయేలా కేక‌లేసింది. ర‌క‌ర‌కాల హావ‌భావాల‌తో మీడియా కెమెరాల‌కు చిక్కింది. శిల్పాశెట్టి, ప్రీతి జింతా వంటి తార‌లు త‌మ ఫ్రాంఛైజీల్ని గెలిపించుకునేందుకు చాలానే  పాట్లు ప‌డ్డారు.

అదంతా అటుంచితే ఐపీఎల్ నేటితో ముగుస్తోంది. ముగింపుగా ఫైన‌ల్ మ్యాచ్ ఎలాంటి ర‌స‌ర‌మ్య‌మైన వీనుల విందును అందిస్తుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. చెన్న‌య్ సూప‌ర్‌కింగ్స్‌- స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య నేడు తుది పోరుకు రంగం సిద్ధ‌మైంది. ఈ ముగింపు మ్యాచ్‌లో .. గ్లామ‌ర్ విందు ప‌సందును ఐపీఎల్ ఫ్రాంఛైజీ క‌ర్త‌లు ప్లాన్ చేశారు. ఈ ముగింపు ఉత్స‌వాల్లో `ఐపీఎల్‌2018 ప్రిల్యూడ్ షో` పేరుతో ఓ అదిరిపోయే ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ఈ కార్య‌క్ర‌మానికి హెస్టింగ్ చేయ‌నున్నారు. హాట్ గాళ్స్‌ క‌త్రిన కైఫ్‌, కృతి స‌నోన్ స్పెష‌ల్ డ్యాన్సులతో హుషారెత్తించ‌నున్నారు. ఇక యువ‌హీరో ఆర్య‌న్ కార్తీక్ లైవ్ షో ఆక‌ట్టుకోనుందిట‌. మొత్తానికి క్రికెట్ టోర్నీ మొద‌ల‌వ్వ‌డానికి గ్లామ‌ర్ కావాలి. ముగించేందుకు గ్లామ‌ర్ కావాలి. ఇదో ర‌స‌ర‌మ్య‌మైన రంజైన వీనుల విందైన టోర్నీ అని చెప్పాలి.

User Comments