మాజీ ప్రియులతో క‌త్రినా స‌ర‌సాలు.. 

విడిపోయిన మ‌నుషుల‌ను.. మ‌న‌సులను క‌ల‌ప‌డం క‌ష్టం అంటారు. కానీ క‌త్రినాకైఫ్ మాత్రం చాలా ఈజీగా క‌లిసిపోతుంది. త‌న పాత ప్రియుల‌తో హాయిగా వ‌ర‌స సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే జ‌గ్గాజాసూస్ లో ర‌ణ్ బీర్ క‌పూర్ తో ఆడిపాడింది ఈ భామ‌. ఆ సినిమా డిజాస్ట‌ర్. ఇక ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ తో టైగ‌ర్ జిందా హై సినిమాలో న‌టిస్తుంది. అస‌లే ఈ భామ కెరీర్ గాడి త‌ప్పి రెండేళ్లైపోయింది. ఒక్క విజ‌యం అంటూ అల్లాడిపోతుంది. పైగా అవ‌కాశాలు కూడా లేవు. ఇలాంటి టైమ్ లో అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుంటుంది క‌త్రినాకైఫ్. స‌ల్మాన్ కు సుల్తాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే.. మ‌రో మాజీ ప్రియుడు ర‌ణ్ బీర్ క‌పూర్.. తాను క‌బీర్ ఖాన్ తో చేయ‌బోయే సినిమాలో క‌త్రినాతో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్క‌నుంది. ఇక దాంతోపాటు తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా వ‌చ్చేసింది. టైగ‌ర్ జిందా హై సెట్స్ పై ఉండ‌గానే అలీ అబ్బాస్ జాఫ‌ర్.. స‌ల్మాన్ తో “ఖాన్” అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులోనూ క‌త్రినాకైఫ్ నే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. 2018 చివ‌ర్లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కనుంది. మొత్తానికి వ‌ద్ద‌న‌కున్న మాజీ ప్రియులే ఇప్పుడు క‌త్రినా కెరీర్ కు అండ‌గా నిలిచారు.