ఈ బాదుడేందిరో.. బంతాట ఏందిరో!

బంతి బంతికో బౌండ‌రీ.. బాదే స‌త్తా ఎవ‌రికి  ఉంది. అప్ప‌ట్లో టెండూల్క‌ర్.. మ‌ధ్య‌లో సెహ్వాగ్ ఇలా బాదేవారు. ఒక్కో బంతి గ్యాల‌రీలో ప‌డితే క్యాచ్ చేసేందుకు ప్రేక్ష‌కులు ఆరాట‌ప‌డేవారు.  యువ‌రాజ్, కోహ్లీ బాదినా ఇలాగే ఉంటుంది. అయితే వీళ్లంద‌రినీ మించి ఈ బాదుడేంటో కానీ, వామ్మోవ్ క‌త్రిన‌లో ఉన్న ఈ కొత్త స్కిల్ మైమ‌రిపిస్తోంది.
స‌ల్మాన్ – క‌త్రిన జంట‌గా న‌టిస్తున్న భ‌ర‌త్ ఓవైపు చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే ఖాళీ స‌మ‌యంలో ఇలా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది క‌త్రిన‌. ప్యాక‌ప్ కే బాద్ అంటూ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. నాట్ ఏ బ్యాడ్ ఆల్ రౌండ‌ర్ .. అంటూ కాన్ఫిడెన్స్ వ్య‌క్తం చేస్తోంది. ఇంప్రూవ్ మెంట్ ఉంది. స్వింగ్ లో ఉన్నా.. మీ ఆయ‌న కోహ్లీకి ఓ మాట చెప్పి పెట్టు. వ‌చ్చే ప్ర‌పంచక‌ప్ లో చోటు కావాలి.. అని త‌న ఫ్రెండు అనుష్క శ‌ర్మ‌ను అడిగేసింది క‌త్రిన‌.