హాటీ పారితోషికం 12కోట్లు

Last Updated on by

స్వాగ్ సే స్వాగ‌త్ .. అంటూ మెరుపులు మెరిపించింది క‌త్రిన‌కైఫ్‌. `టైగ‌ర్ జిందా హై` త‌న‌ కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో స‌ల్మాన్ భాయ్‌కి ధీటుగా లేడీ కాప్ పాత్ర‌లో మ‌తి చెడ‌గొట్టింది. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో ఫైట్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఇంత‌కుముందు ధూమ్ 3లో క‌త్రిన మెరుపు విన్యాసాల‌ను మ‌ర్చిపోక ముందే టైగ‌ర్ జిందా హైలో పాక్ గూఢాచారి పాత్ర‌లో దుమ్ము దులిపేసింది. అదంతా స‌రే.. రెండు ద‌శాబ్ధాల పాటు తిరుగులేని అనుభ‌వం ఉన్న ఈ అమ్మ‌డి పారితోషికం ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు.

క‌త్రిన‌కైఫ్ ఒక్కో సినిమాకి ఏకంగా 12 కోట్ల పారితోషికం అందుకుంటోంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న `ద‌బాంగ్‌- ది టూర్ రీలోడెడ్‌` (ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు) చిత్రంలో నాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకి 12కోట్ల మేర పారితోషికం అందుకుంటోందిట‌. ఇక‌పోతే షారూక్ స‌ర‌స‌న జీరో చిత్రంలో న‌టిస్తున్నందుకు అంతే పెద్ద మొత్తం అందుకుంటోందిట ఈ భామ‌. స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న రేస్ 3 చిత్రంలో న‌టిస్తున్న కుర్ర‌భామ‌ జాక్విలిన్ ఫెర్నాండెజ్, `ద‌బాంగ్ 3`లో న‌టిస్తున్న సోనాక్షి సిన్హా ఇరువురూ 6-8 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నార‌ట‌. వామ్మో .. బాలీవుడ్‌ బ‌డ్జెట్ల‌లో హీరోయిన్ల వాటా పెద్ద‌దే ఉంది క‌దూ?

User Comments