`క‌వ‌చం` బిజినెస్ ఎంత‌?

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా న‌టించిన నాలుగో సినిమా `క‌వ‌చం` ఈనెల 7న రిలీజ్‌కి ఏర్పాట్లు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌నివాస్ మామిళ్ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, వంశధార క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. ఈ శుక్ర‌వారం రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో సాయి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించారు.

`క‌వ‌చం` రిలీజ్ కి చాలా ముందే లాభాల్లో ఉంది. డిజిటల్‌, శాటిలైట్ క‌లిపి 15కోట్లు వ‌చ్చింది. థియేట్రిక‌ల్ హ‌క్కులు స‌హా అన్నిటినీ క‌లుపుకుంటే 10 కోట్లు లాభాల్లోనే ఉన్నాం అని సాయి శ్రీ‌నివాస్ అన్నారు. ఈసారి గ‌త చిత్రాల త‌ర‌హాలో బ‌డ్జెట్ల ప‌రంగా అదుపు త‌ప్ప‌లేద‌ని, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఈ చిత్రానికి ప‌ని చేశామ‌ని తెలిపారు. స్టార్ హీరోయిన్ల‌తో సినిమాలు చేయ‌డానికి కార‌ణం సినిమాకి అద‌న‌పు హంగు ఉంటుంద‌నే ఈ ప్లానింగ్ అని సాయి శ్రీ‌నివాస్ అన్నారు. మైండ్ గేమ్ నేప‌థ్యంలో కాప్ డ్రామా ఇది. యాక్ష‌న్‌ని మించి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటాయి. కొత్త కుర్రాడే అయినా ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్‌ ఎంతో అనుభ‌వ‌జ్ఞుడిగా తెర‌కెక్కించాడు. సినిమా విజ‌యంపైనా ధీమా ఉంది.. అని తెలిపారు. అయితే బెల్లంకొండ న‌టించిన ఈ సినిమాని దాదాపు 30కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారని తెలుస్తోంది. అల్లుడు శీను సినిమా బ‌డ్జెట్ ఇంచుమించు అంతే అయ్యింది. అల్లుడు శ్రీ‌ను కాస్ట్ ఫెయిల్యూర్ మాత్ర‌మే. మొత్తం సొమ్ములు వెన‌క్కి రాక‌పోయినా బెల్లంకొండ గ్రాండ్ ఎంట్రీకి పేరొచ్చింది. సినిమా హిట్టు అన్న టాక్ వ‌చ్చింది. ఈసారి క‌వ‌చం బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్ రావాల్సి ఉంటుంది. డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు, థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో నిర్మాత‌లు సేఫ్‌గా ఉన్నా పంపిణీదారులు లాభ ప‌డాల్సి ఉంటుంది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ కెరీర్ బెస్ట్‌గా రిలీజ్ చేస్తున్నామ‌ని చెబుతున్నా.. అమెరికాలో 13లొకేష‌న్ల‌లో మాత్ర‌మే రిలీజ్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. బ‌హుశా.. సాక్ష్యం, జ‌య జాన‌కి నాయ‌క ఓవ‌ర్సీస్‌లో ఫెయిల్యూర్ ప్ర‌భావంతోనే అక్క‌డ బాగా త‌గ్గించార‌న్న‌మాట‌.