కేసీఆర్ బ‌యోపిక్ ఇదే

ప్రత్యేక తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ పాత్ర ఎంత‌? ప‌్ర‌త్యేక‌ రాష్ట్రం కోసం ఆయ‌న చేసిన‌ది ఎంత‌? అన్న‌ది వెండితెర‌పై చూపించే ప్ర‌య‌త్నం సాగుతోంది. ఓ ర‌కంగా ఇది కేసీఆర్ బ‌యోపిక్ అనే చెప్పాలి. ఈ సినిమా టైటిల్ ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కేసీఆర్‌ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్‌ నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో సినిమా మొద‌లైంది. కేసీఆర్ పాత్ర‌లో నాజర్ న‌టిస్తున్నారు.

త‌న పాత్ర గురించి నాజ‌ర్‌ మాట్లాడుతూ…‘‘నేను ఇప్పటి వరకు ఐదు వందల సినిమాల్లో నటించాను. హిస్టారికల్‌, ఫిక్షన్‌ ఇలా పలు రకాల పాత్రల్లో నటించాను. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి..గెలిచిన కేసీఆర్‌ గారి పాత్రలో నటించడం పట్ల చాలా ఎమోషనల్‌గా ఫీ లవుతున్నా. ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. ఈ పాత్ర కోసం దర్శక, నిర్మాత లు నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్‌గారు గ్రేట్‌ ఫైటర్‌. నాకున్న అనుభవాన్నంతా ఈ పాత్ర కోసం పెట్టి…పూర్తి న్యాయం చేయా లన్న సంకల్ప ం తో ఉన్నాను. ఇప్పటికే కేసీఆర్‌ వీడియోలు చాలా చూశాను. ఇంకా చూస్తాను. ఆయన ప్రతి మాటలో ఎంతో లోతైన అర్థం ఉంటుంది. అలాగే కేసీఆర్ పై వ‌చ్చిన పుస్తకాలు చదువుతున్నా’’ అన్నారు. కేసీఆర్‌ గారు పత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం దగ్గర నుంచి బంగారు తెంగాణాగా తీర్చిదిద్దే క్రమం వరకు ఈ సినిమా ఉంటుంద‌ని, నవంబర్‌ 29 న రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత తెలిపారు.